Site icon NTV Telugu

Mission to Space Station: ఐఎస్ఎస్‌కి భారత వ్యోమగామి.. ఐఏఎఫ్ పైలట్లకు నాసా శిక్షణ..

Iss

Iss

Mission to Space Station: భారత్ మరో అంతరిక్ష కార్యక్రమానికి సిద్ధమవుతోంది. భారత వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా భారత్ వైమానిక దళానికి చెందిన పైలెట్లకు శిక్షణ ఇస్తోంది. నాసా-ఇస్రో మధ్య సహకారంలో భాగంగా పైలట్లకు శిక్షణా కార్యక్రమం జరుగుతోంది. 2024 నాటికి భారత వ్యోమగామిని స్పేస్ స్టేషన్‌కి పంపించాలనే మనదేశం భావిస్తోంది.

అయితే, శిక్షణ తీసుకుంటున్న భారత వ్యోమగామి అభ్యర్థుల గుర్తింపును వెల్లడించలేదు. వీరంతా ఇప్పటికే రష్యాలోని గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో ప్రారంభ శిక్షణ పూర్తి చేశారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లోని నాసా యొక్క జాన్సన్ స్పేస్ సెంటర్‌లో అధునాతన శిక్షణ పొందుతున్నారు.

Read Also: CM Siddaramaiah: “మసీదులు, దర్గాల్లోకి వెళ్తారు కానీ గుడిలోకి మాత్రం వెళ్లరు”.. సిద్దరామయ్యపై బీజేపీ విమర్శలు..

భారత్ తరుపున వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ 1984లో అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి భారతీయ పౌరుడిగా నిలిచారు. ప్రస్తుతం గగన్ యాన్ ద్వారా భారత్ వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపి, వారిని సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఐఎస్ఎస్ మిషన్ భారతదేశం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘గగన్ యాన్’ మిషన్‌కి కీలకంగా మెట్టుగా మారబోతోంది. గగన్యాన్ మిషన్ సన్నాహాలలో భాగంగా, ఇస్రో 2024 లో రెండు మానవరహిత మిషన్లను నిర్వహించాలని యోచిస్తోంది.

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) భూమికి 400 కిలోమీటర్లకు ఎగువన, భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న మానవ నిర్మిత ఓ ప్రయోగశాల. లో ఎర్త్ ఆర్బిట్‌లో భూమి చుట్టూ తిరుగుతుంది. దీని నిర్మాణంలో రష్యా, అమెరికా, జపాన్, కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాల అంతరిక్ష సంస్థల సహకారం ఉంది. మానవులు ఉండేందుకు, పలు రక్షాల ప్రయోగాలు, పరీక్షలు జరిగేందుకు దీనిని నిర్మించారు.

Exit mobile version