NTV Telugu Site icon

Rajnath Singh: భారత్‌తో పాక్ స్నేహంగా ఉంటే.. ఐఎంఎఫ్ కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చే వాళ్లం..

Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh: పాకిస్తాన్‌ని ఉద్దేశించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, భారత్‌తో స్నేహంగా ఉంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి ఆ దేశం పొందిన దాని కన్నా అతిపెద్ద బెయిలవుట్ ప్యాకేజీ ఇచ్చే వాళ్లం అని ఆదివారం అన్నారు. బందిపొరా జిల్లాలోని గురేజ్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

2014-15లో ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. 2014-15లో ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్‌కి రూ. 90,000 కోట్లు ఇచ్చింది. ప్రస్తుతం ఐఎంఎఫ్ పాకిస్తాన్‌కి ప్రకటించిన బెయిల్ అవుట్ ప్యాకేజీ కన్నా ఎక్కువ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన ‘‘ మేము స్నేహితుల్ని మార్చగలం కానీ పొరుగువారిని మార్చలేము’’ వ్యాఖ్యల్ని ప్రస్తావించారు.

Read Also: Electric Scooter: మార్కెట్లోకి మరో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిమీ

జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తుంటే, పాకిస్తాన్ మాత్రం తన నిధుల్ని దుర్వినయోగం చేస్తుందని రాజ్‌నాథ్ విమర్శించారు. పాక్ తన గడ్డని ఉగ్రవాద కర్మాగారంగా మార్చిందని, దానిని నడపడానికి ఇతర దేశాల నుంచి డబ్బు కోరుతోందని అన్నారు. భారత్‌కి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని సాధానంగా ఉపయోగిస్తుందని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ విశ్వనీయతపై దాని మిత్రదేశాలకు కూడా సందేహాలు ఏర్పడ్డాయని, ఒంటరిగా మారిందని అన్నారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత తీవ్ర నిరాశకు లోనైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుందని, అయినా కూడా ఫలితం లేదని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యం పాకిస్తాన్‌కి ఇష్టం లేదని, ఒకవేళ ఆ దేశం భారత్‌పై దాడులు చేస్తే, సమాధానం చెబుతామని అన్నారు.