Site icon NTV Telugu

Congress: ఏడాదిలోగా దేశంలో పార్లమెంట్ ఎన్నికలు.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు..

Congress

Congress

Congress: లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2014, 2019లో స్వయంగా మెజారిటీ మార్క్(272) సీట్లకు పైగా బీజేపీ గెలుచుకుంటే, 2024లో మాత్రం మెజారిటీ మార్కుకి దాదాపుగా 30 సీట్ల దూరంలో 240 సీట్లను గెలుచుకుంది. అయితే ఎన్డీయే కూటమిగా 293 సీట్లను సాధించింది. దీంతో మళ్లీ మోడీ అధికారం చేపట్టడానికి మార్గం సుగమం అయింది. తెలుగుదేశం, జేడీయూ, శివసేన వంటి ఎన్డీయే పార్టీలు ప్రధాని మోడీకి సంపూర్ణ మద్దతును తెలియజేశాయి. ఎన్డీయే పక్షనేతగా ఎన్నుకున్నాయి. ఈ నెల 9న మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆరు నెలల నుంచి ఏడాది మధ్య పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీలు నరేంద్ర మోడీని తమ నాయకుడిగా మరియు తదుపరి ప్రధానమంత్రిగా ఎంచుకున్న రోజున బఘేల్ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Barathiyudu 2: ‘తాత వస్తాడే.. అదరగొట్టి పోతాడే..’ భారతీయుడు 2 నుండి మరోపాట విడుదల..

ఓ బహిరంగ సమావేశంలో బఘేల్ మాట్లాడుతూ.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అతని రాజస్థాన్ కౌంటర్ భజన్ లాల్ శర్మ మరియు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లపై కూడా విరుచుకుపడ్డారు.యోగి కుర్చీ వణుకుతోందని, భజన్ లాల్ ఊగిసలాడుతున్నారని, ఫడ్నవీస్ కూడా రాజీనామా చేస్తున్నారని చెప్పారు.

బీజేపీకి స్వతహాగా మెజారిటీ రాకపోవడం, ఇతర ఎన్డీయే మిత్ర పక్షాలపై ఆధారపడి ఉండటంతో, ఎప్పుడైనా ప్రభుత్వం కూలిపోవచ్చని ఇండియా కూటమి పార్టీలు భావిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వంటి వారు మద్దతు ఉపసంహరించుకుంటే ఎన్డీయే ప్రభుత్వం ఉండదని కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు.

Exit mobile version