Pakistan Minister: ఆపరేషన్ సిందూర్‌తో తీవ్రంగా దెబ్బ తిన్నప్పటికీ పాకిస్తాన్ బుద్ధి మారడం లేదు. ఆ దేశ ముఖ్య నేతలు భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత దాడి సమయంలో చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేసిన నవ్వుల పాలైన ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత చరిత్ర తెలియకుండా మాట్లాడి నవ్వులపాలయ్యారు. ‘‘ఔరంగజేబు సమయంలో తప్పా, భారత్ ఎప్పుడూ ఐక్యం లేదు’’ అని అన్నారు.
‘‘ ఔరంగజేబు సమయంలో తప్పా, భారత్ నిజంగా ఎప్పుడూ ఐక్యం లేదని చరిత్ర చెబుతోంది. అల్లాహ్ పేరుతో పాకిస్తాన్ ఏర్పడింది. స్వదేశంలో మేము వాదిస్తాము, పోటీ పడుతాము. కానీ భారతదేశంతో పోరాటం విషయంలో కలిసి వస్తాము’’ అని ఆయన సమా టీవీతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Myanmar: మయన్మార్ బౌద్ధ ఉత్సవంపై బాంబు దాడి.. 24 మంది మృతి
నిజానికి మొఘలుల కన్నా ముందు నుంచే భారత్ ఐక్యంగా ఉంది. తురుష్కల దండయాత్రలకు ముందు నుంచే భారతదేశాన్ని చాలా రాజ వంశాలు పాలించాయి. క్రీస్తుపూర్వం 4వ శతాబ్ధంలో చంద్రగుప్త మౌర్యుడి పాలనలో మౌర్య సామ్రాజ్యం దాదాపు భారత్ అంతా విస్తరించింది. ఆ తర్వాత అశోకుడు ఇప్పుడు ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ను కలుపుకుని భారతదేశాన్ని ఏలారు. సముద్రగుప్తుడు, హర్షుడు కూడా భారతదేశాన్ని పాలించారు.
ఇదిలా ఉంటే, తనకు బుద్ధి లేదని ఖవాజా ఆసిఫ్ మరోసారి నిరూపించుకున్నారు. భారతదేశంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. భారత్-పాకిస్తాన్ వివాదంలో తటస్థంగా ఉన్న దేశాలు ఇప్పుడు పాకిస్తాన్ శిబిరంలో చేరాయని చెప్పాడు. భారతదేశానికి మద్దతు ఇస్తున్న వారు ఇప్పుడు మౌనంగా ఉన్నారని చెప్పుకొచ్చాడు.
పాకిస్తాన్‌పై భారత్ సైనిక చర్య బీహార్ ఎన్నికల కోసమే అని ఆసిఫ్ చెప్పడం మరింత హాస్యాస్పదంగా మారింది. పాకిస్తాన్ ఆపరేషన్ బన్యన్ అల్ మార్సుస్ ప్రారంభించినప్పటి నుంచి మోడీ ప్రజాదరణ తగ్గిందని, మోడీని సమర్థించే వారు ఇప్పుడు విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. భారతదేశాన్ని దాని యుద్ధ విమానాల కింద పాతిపెడతా అని బెదిరించిన తర్వాత ఆసిఫ్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
