Site icon NTV Telugu

India at UN: యూఎన్‌లో ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా భారత్ ఓటు..

Israel

Israel

India at UN: తూర్పు జెరూసలేంలో పాటు ఆక్రమిత పాలస్తీనా భూభాగం, ఆక్రమిత సిరయన్ గోలన్ ప్రాంతాల్లో ఇజ్రాయిల్ సెటిల్‌మెంట్ కార్యకలాపాలను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితితో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మద్దతుగా ఇజ్రాయిల్ వైఖరిని ఖండిస్తూ భారత్ ఓటసింది. తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు ఓటేయగా అందులో భారత్ కూడా ఉంది. ఈ ముసాయిదా తీర్మానానికి నవంబర్ 9 గురువారం ఆమోదం లభించింది. ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయిల్ సెటిల్‌మెంట్లను ప్రోత్సహించడాన్ని ఇండియా తప్పు పట్టింది.

Read Also: Israel: యుద్ధం తర్వాత గాజాను ఎవరు పాలిస్తారు.? ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఏమన్నారంటే..

‘‘ తూర్పు జెరూసలేం, ఆక్రమిత సిరయన్ గోలాన్‌తో సహా ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయిల్ సెటిల్‌మెంట్లు’’ అనే అంశంపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అత్యధిక మెజారిటీతో ఆమోదించారు. కెనడా, హంగేరీ, ఇజ్రాయిల్, మార్షల్ ఐలాండ్స్, ఫెడరేషన్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా, నౌరు, అమెరికా ఈ ఏడు దేశాలు మాత్రమే తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి. 18 దేశాలు ఓటింగ్‌కి దూరంగా ఉన్నాయి.

Read Also: CM Pinarayi Vijayan: భారత్, ఇజ్రాయిల్‌తో సైనిక, రక్షణ ఒప్పందాలను తెంచుకోవాలి.. సీఎం సంచలన వ్యాఖ్యలు..

భారత్ తీర్మానానికి అనుకూలంగా ఓటేయడాన్ని షేర్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే.. ‘‘ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. సెటిలర్ల ద్వారా ఇజ్రాయిల్ పాలస్తీనాను ఆక్రమించడం చట్టవిరుద్ధం ఆయన అన్నారు.

Exit mobile version