Site icon NTV Telugu

Modi-Trump: బలపడుతున్న భారత్-అమెరికా బంధం.. సుంకాలు తగ్గే అవకాశం

Modi3

Modi3

సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య బంధం చెడింది. ట్రంప్-మోడీ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తాజాగా ఆ బంధం మళ్లీ చిగురిస్తున్నట్లుగా కనిపిస్తోంది. త్వరలోనే భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశాలు ఉన్నట్లుగా నివేదికలు అందుతున్నాయి. రష్యా నుంచి చమురు దిగుమతులను క్రమంగా భారత్ తగ్గించుకునే అవకాశాలు ఉన్నట్లు వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో అమెరికా సుంకాలను 15 శాతం నుంచి 16 శాతం వరకు తగ్గించే అవకాశాలు ఉన్నట్లుగా నివేదికలు అందుతున్నాయి.

ఇది కూడా చదవండి: Tejashwi Yadav: తేజస్వి యాదవ్ హామీల వర్షం.. జీవికా దీదీలకు రూ.30 వేలు ఇస్తామని ప్రకటన

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడారు. దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికే ఫోన్ చేసినా.. ఎక్కువ శాతం మాత్రం వాణిజ్యంపైనే చర్చ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు రాయిటర్స్ పేర్కొంది. తాజా ఫోన్ కాల్ సంభాషణ ప్రకారం రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం జరగవచ్చని.. దీంతో 16 శాతం వరకు అమెరికా సుంకాలు తగ్గించవచ్చని ఈ విషయం తెలిసిన ముగ్గురు వ్యక్తులు పేర్కొన్నట్లుగా రాయిటర్స్ కథనంలో పేర్కొంది. ఈ నెలలో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని నివేదించింది.

ఇది కూడా చదవండి: INDIA Bloc: దీపావళి తర్వాత కూటమిలో జ్ఞానోదయం.. తేజస్వి యాదవ్‌కు చిగురిస్తున్న కొత్త ఆశలు!

భారత్‌పై తొలుత ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధాలు కొనసాగిస్తున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం అమలవుతోంది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మరోసారి ఆ బంధం బలపడుతున్నట్లుగా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నెలలోనే కీలక పరిణామం జరగవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

Exit mobile version