Cervical Cancer Vaccination: 9-14 ఏళ్ల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషన్.. ప్రారంభించనున్న కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cervical Cancer Vaccination: మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ని ఎదుర్కొనే లక్ష్యంతో కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దేశంలో 9-14 ఏళ్ల బాలికలకు హ్యుమన్ పాపిల్లోమావైరస్ (HPV) టీకా ప్రచారాన్ని ప్రారంభించనుంది. సర్వైకల్ క్యాన్సర్‌ని అడ్డుకునే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఇమ్యూనైజేషన్ డ్రైవ్ ప్రారంభించనున్నారు. మూడు దశల్లో ఈ కార్యక్రమం ఉండనుంది. ప్రారంభ దశ కోసం 7 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని సిద్ధం చేశారు. కేంద్రం ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
Read Also: Prasanth Varma: హనుమాన్ ను దీవించడానికి నిజంగా హనుమంతుడే వచ్చాడు..
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
గర్భాశయ క్యాన్సర్(సర్వైకల్ క్యాన్సర్) భారతదేశ మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో రెండో ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గర్భాశయ క్యాన్సర్‌ను ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అత్యంత సాధారణ రకం క్యాన్సర్‌గా పేర్కొంది. HPV వ్యాక్సిన్ ప్రస్తుత ధర రూ. 2000కి అందుబాటులో ఉంది. ఇది కేవలం గర్భాశయ క్యాన్సర్‌ని మాత్రమే కాకుండా మలద్వారాం, యోగి, ఒరోఫారింక్స్‌ని ప్రభావితం చేసే ఇతర ప్రాణాంతకాలను కూడా ఎదుర్కోవడానికి ఈ వ్యాక్సిన్ సాయపడుతుంది. జననేంద్రియ మొటిమలకు కారణమయ్యే క్రిముల నుంచి రక్షణ అందిస్తుంది. హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) కలిగించే ఆరోగ్య ప్రమాదాలను అడ్డుకుంటుంది.
ప్రపంచంలోని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులలో దాదాపు ఐదవ వంతుగా ఉన్న భారతదేశంలోనే ఉన్నాయి. ఈ క్యాన్సర్ ఇటీవల కాలంలో పెరుగుతోంది. క్యాన్సర్ కేసుల సంఖ్య 2022లో 14.6 లక్షల నుండి 2025 నాటికి 15.7 లక్షలకు పెరుగుతుందని అంచనా. ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో గర్భాశక క్యాన్సర్‌ని చేర్చాలనే ఉద్దేశంతో కేంద్రం అందరికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది. టీకాను ఉచితంగా అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వైరస్‌కి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు వ్యాక్సిన్ ఇవ్వాలని అనుకుంటోంది.
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!