Site icon NTV Telugu

India on Russian oil: రష్యా చమురు కొనుగోలుపై జైశంకర్ క్లారిటీ..

Jaishankar

Jaishankar

India on Russian oil: భారత్ అమెరికా ట్రేడ్ డీల్ తర్వాత, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించిందనే వార్తల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చమురు కొనుగోళ్లు రాజకీయ ఒత్తిడితో కాకుండా, ఖర్చులు, లభ్యత, ప్రమాదాలను బట్టి జరుగుతాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన జైశంకర్.. అమెరికాతో ట్రేడ్ డీల్ జరిగినా.. భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి మారదని స్పష్టం చేశారు.

Read Also: Mahashivratri 2026: ‘మహాశివరాత్రి’ వ్రత మహిమ.. ఉపవాసం, జాగరణ తప్పక ఉండాల్సిందేనా?

ఈ వ్యాఖ్యలకు ముందు యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ.. భారత్ రష్యన్ ఆయిలు కొనుగోలు చేయబోవడం లేదని తమకు హామీ ఇచ్చిందని అన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత జైశంకర్ రష్యన్ చమురు విషయంలో స్పష్టత ఇచ్చారు. ‘‘భారత్ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మీ ఆలోచనతో కలవని నిర్ణయాలు తీసుకోవచ్చు’’ అని అన్నారు.

వారం రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ రష్యా చమురు కొనుగోళ్లు ఆపి, అమెరికా నుంచి ఎక్కువ కొనుగోళ్లు చేస్తామని అంగీకరించిందని ప్రకటించారు. ఇదిలా ఉంటే, భారత్ యూఎస్ ట్రేడ్ డీల్ తర్వాత రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ.. భారత్ ఎక్కడా కూడా రష్యన్ ఆయిల్ కొనుగోలును నిలిపేస్తున్నట్లు ప్రకటించలేదని అన్నారు.

Exit mobile version