Site icon NTV Telugu

Rafale-M Jets: భారత సముద్ర జలాలపై ‘రఫేల్‌ ఎం’ గర్జనలు.. ఫ్రాన్స్‌తో కుదిరిన ఒప్పందం

Rafel M

Rafel M

Rafale-M Jets: భారత నౌకాదళం చేతికి మరో అత్యాధునిక యుద్ధ విమానాలు రాబోతున్నాయి. 26 రఫేల్‌ మెరైన్‌ శ్రేణి విమానాలు కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఇరు దేశాలకు చెందిన అధికారలు సమక్షంలో సంతకాలు జరిగాయి. కాగా, ఈ ఒప్పందం పూర్తిగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం మధ్య జరిగింది.. ఈ డీల్‌ విలువ సుమారు రూ.63 వేల కోట్లు. వీటిలో 22 సింగిల్‌ సీటర్ జెట్లు ఉండగా.. 4 ట్విన్‌ సీటర్‌ ట్రైనర్లను ఆర్డర్ చేస్తున్నారు. ఈ మొత్తం డెలివరీలు 2031 వరకు డెలివరీ చేసే అవకాశం ఉంది.

Read Also: Allu Arjun : అల్లు అర్జున్-అట్లీ మూవీలో బ్యూటిఫుల్ హీరోయిన్ ఫిక్స్..?

అయితే, ప్రపంచంలో నౌకాదళాలు ఉపయోగించే అత్యాధునిక ఫైటర్‌ జట్లలో ఒకటిగా రఫేల్‌ మెరైన్‌ను చెబుతారు. దీంట్లో శాఫ్రన్ గ్రూప్ తయారు చేసిన ప్రత్యేకమైన రీఎన్‌ఫోర్స్‌డ్‌ ల్యాండింగ్‌ గేర్స్‌ వినియోగించారు. ఇది విమానవాహక నౌకలపై దిగడానికి చాలా ఈజీగా పని చేస్తుంది. ఈ విమానాల రెక్కలను మడతపెట్టే సౌకర్యం కూడా ఉంటుంది. ఈ విమానాలు ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యపై భారత్‌ మోహరించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వాడుతున్న మిగ్‌ 29ల స్థానాలను ఇవి భర్తీ చేస్తాయి.

Read Also: BSNL Recharge: కేవలం రూ.127 నెలవారీ ఖర్చుతో ఒక సంవత్సరం పాటు అపరిమిత కాలింగ్, డేటా..!

కాగా, ప్రస్తుతం భారత వాయుసేన మొత్తం 36 రఫేల్‌ యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది. తాజాగా నేవీ కూడా వీటిని కొనుగోలు చేస్తుండటంతో రెండు దళాల మధ్య మరింత సమన్వయం పెరుగనుంది. బడ్డీ-బడ్డీ రీఫ్యూయలింగ్‌కు ఛాన్స్ ఉంటుంది. ఓ ఫైటర్‌ జెట్‌ రీఫ్యూయలింగ్‌ పాడ్‌ సాయంతో మరో ఫైటర్‌ జెట్‌లో ఇంధనం నింపడాన్ని ఇలా పిలుస్తారు. అప్పుడు భారీ ఫ్యూయల్‌ ట్యాంకర్‌ విమానాల అవసరం ఉండదు అన్నమాట.

Exit mobile version