Pahalgam Terror Attack: పాక్ పాత్రపై విదేశీ రాయబారులకు ఆధారాలు చూపించిన భారత్
- పాక్ పాత్రపై విదేశీ రాయబారులకు ఆధారాలు చూపించిన భారత్
- భారత్‌కు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లుగా భారత్ గుర్తించింది. లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలను దాయాది దేశం పెంచిపోషిస్తోంది. ఇక పహల్గామ్ ఉగ్ర దాడికి పాల్పడింది తామేనని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే వెనుకుండి లష్కరే తోయిబానే చేయించినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి.
తాజాగా పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్థాన్‌కు సంబంధించిన పాత్రను విదేశీ రాయబారులకు కేంద్ర ప్రభుత్వం ఆధారాలు చూపించింది. పాకిస్థాన్ మద్దతుతోనే ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని పేర్కొంది. దౌత్యవేత్తలకు విదేశాంగ శాఖ ఆధారాలు చూపించింది. ఆధారాలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దేశాలైన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే స్పందించాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్లు దేశాలు పేర్కొన్నాయి. తాజా ఆధారాలతో భవిష్యత్‌లో భారత్ ఏ చర్యలు తీసుకున్నా.. అభ్యంతరాలు రావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాక్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
మంగళవారం పహల్గామ్‌లో ఉగ్రమూకల దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్దీ గాయపడ్డారు. ఈ ఘటనలో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. పాకిస్థాన్‌పై కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే సింధు జలాలను నిలిపివేసింది. అంతేకాకుండా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ-వాఘా సరిహద్దును మూసేసింది.
తాజావార్తలు
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!