Site icon NTV Telugu

India vs America: అమెరికా 10 శాతం సుంకాన్ని తగ్గించాలి.. ట్రంప్ ముందు భారత్ డిమాండ్

America

America

India vs America: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాల దిగుమతులపై 10 శాతం బేస్‌లైన్ టారిఫ్ విధించాడు.. ఈ నేపథ్యంలో జులై 9వ తేదీ నాటికి ఈ పన్నులు అమలులోకి వస్తాని ఏప్రిల్ 2వ తేదీన యూఎస్ ప్రెసిడెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ- వాషింగ్టన్ మధ్య వాణిజ్య ఒప్పందం కొనసాగుతుంది. జూన్ 4వ తేదీన అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీకి చేరుకుంది. ఒప్పందాల అంశంపై రెండు దేశాల మధ్య ​​ఐదోసారి ముఖాముఖి చర్చలు జరిగాయి.

Read Also: kattalan: ‘కట్టలన్’ మూవీ నుంచి సునీల్ పవర్ ఫుల్ పోస్టర్..

ఇక, ఈ సందర్భంగా అమెరికా కొత్తగా విధించిన 10 శాతం బేస్‌లైన్ సుంకాన్ని తొలగించడమే కాకుండా.. జూలై 9 నుంచి ప్రతిపాదిత 16 శాతం అదనపు సుంకాన్ని కూడా అమలు చేయకూడదని భారత్ డిమాండ్ చేసింది. అమెరికా ఈ సుంకాలను తొలగించకపోతే, అమెరికన్ వస్తువులపై ప్రతీకార సుంకాలను కొనసాగించే హక్కు కూడా తమకు ఉంటుందని ఈ సమావేశంలో భారత ప్రతినిధులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ఉంచారు.

Read Also: Sangareddy: అన్న ఫ్రెండ్ తో వెళ్లిపోయిన చెల్లి.. తండ్రిని కొట్టి చంపిన కొడుకు

అలాగే, జూన్ 10వ తేదీన కూడా ఢిల్లీలో మరోసారి భారత ప్రతినిధులతో ఈ బృందం సమావేశం కానుంది. కాగా, ఇరు దేశాల మధ్య ఒప్పందాలపై ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ.. అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని అన్నారు. ఇటువంటి పరిస్థితిలో, ఏదైనా ఒప్పందం సమతుల్యంగా, ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి అని సూచించారు. అమెరికా కూడా ప్రతిస్పందిస్తే, యూఎస్ వస్తువులకు తన మార్కెట్‌ను మరింతగా తెరవడానికి సిద్ధంగా ఉన్నామని భారత్ సూచించింది.. మా వాణిజ్యం పోటీతత్వం కాదు, పరిపూరకమైందని సదరు అధికారి తెలిపారు.

Exit mobile version