Site icon NTV Telugu

India Russia: సంక్షోభ సమయంలో రష్యా నుంచి భారత్‌కు చమురు..!

Ind Russia

Ind Russia

India Russia: మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం వల్ల మొత్తం ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. ఈ యుద్ధంలో ఇరాన్ గల్ఫ్ లోని ఇతర దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రైయిన్, కువైట్‌లపై కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘‘హార్మూజ్ జలసంధి’’ని మూసేసింది. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం ఈ మార్గం గుండానే రవాణా అవుతోంది. భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాలు దీని వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

Read Also: Sanju Samson: చారిత్రాత్మక ఇన్నింగ్స్.. సంజు శాంమ్సన్ కు ఐసిసి నుండి ప్రధాన బహుమతి

ఈ సంక్షోభ సమయం వేళ రష్యా భారత్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధమైంది. చమురు అంతరాయాన్ని భర్తీ చేయడానికి తాము సిద్ధంగా ఉంది. భారత జలాల సమీపంలోని ఓడల్లో దాదాపు 9.5 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ముడి చమురు ఉంది. కొన్ని వారాల్లో ఇవి చేరుకుంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారతదేశం వద్ద కేవలం 25 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి. అందుకే కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతోంది.

భారత రిఫైనరీలు రోజుకు 5.6 మిలియన్ బ్యారెళ్ల చమురును శుద్ధీకరిస్తాయి. హార్ముజ్ జలసంధి మూసేయడం వల్ల భారత్‌కు 40 శాతం చమురు దిగుమతులపై ప్రభావం పడుతుంది. అయితే , ఈ 40 శాతం అవసరాలను తీర్చడంలో రష్యా సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. జనవరిలో భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు రోజుకు సుమారు 1.1 మిలియన్ బ్యారెళ్లకు తగ్గింది. ఇది నవంబర్ 2022 తర్వాత కనిష్ట స్థాయి. అమెరికా ఒత్తిళ్ల కారణంగా ఈ తగ్గుదల నమోదైంది. మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా 21.2 శాతానికి పడిపోయింది. అయితే, ఫిబ్రవరిలో ఇది మళ్లీ సుమారు 30 శాతానికి పెరిగినట్లు సమాచారం.

Exit mobile version