Site icon NTV Telugu

Vikram Misri: భారత్‌ను అంతర్జాతీయంగా దెబ్బ తీయడానికి పాకిస్తాన్ అసత్య ప్రచారం..

Misri

Misri

Vikram Misri: గత రాత్రి భారత నగరాలపై, పౌరులపై పాకిస్తాన్ ఉద్దేశపూర్వక దాడులు జరిపింది అని భారత విదేశీ వ్యవహరాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. భారత్ ఉద్రిక్తతను పెంచకుండా, బాధ్యతాయుతంగా ఈ దాడులకు తగిన సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు. పాక్ దాడులకు సంబంధించి ప్రభుత్వ ప్రమేయం స్పష్టమైంది.. ఈ దాడులు పాక్ ప్రభుత్వ సహకారంతో, కనీసం వారికి తెలిసే జరిగినవని పేర్కొనడం గమనార్హం.. పూంఛ్‌లోని గురుద్వారాపై దాడిలో స్థానిక సిక్కులతో పాటు ధార్మిక గాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయారని ఫారెన్ సెక్రెటరీ మిస్రీ చెప్పుకొచ్చారు.

Read Also: India-Pak War : దేశంలో మతఘర్షణలు సృష్టించేందుకు పాక్ ప్రయత్నించింది : విక్రమ్ మిస్రీ

అయితే, పాకిస్తాన్ మాత్రం ఈ దాడి చేసినట్లు ఒప్పుకోకుండా, భారత్‌ను దోషిగా ప్రకటించడానికి ట్రై చేస్తుందని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. “నన్కానా సాహిబ్” గురుద్వారాపై భారత దాడి చేసినట్టు పాక్ అబద్ద ప్రచారం చేస్తుంది.. పాక్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, “నన్కానా సాహిబ్ గురుద్వారా” పై భారత్ దాడి చేసిందని అబద్దపు ఆరోపణలు చేస్తోందన్నారు. భారత్‌ను అంతర్జాతీయంగా దెబ్బ తీయడానికి పాకిస్తాన్ అసత్యాలు ప్రచారం చేస్తోంది.. భారత్‌లోని ఐక్యతే పాకిస్తాన్‌ సహించలేకపోతుంది అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు.

Exit mobile version