MEA: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు..
- కరాచీ దాడిపై పాక్ ఆరోపణల్ని ఖండించిన భారత్..
- ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై చర్యలు తీసుకోవాలని పాక్‌కు సూచన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MEA: ఇటీవల పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలోని సింధ్ రేంజర్స్ స్థావరంపై ఉగ్రవాద దాడి జరిగింది. అయితే, ఈ దాడి వెనక భారత్ ఉందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారణమైనవని కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ(MEA) స్పష్టం చేసింది. ఇతరుల వైపు వేలెత్తి చూపేటప్పుడు సొంత దేశంలో పనిచేస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌కు భారత్ సూచించింది.
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. కరాచీ ఘటనకు సంబంధించి భారత్‌పై పాక్ మీడియా చేస్తున్న అన్ని ఆరోపణల్ని తిరస్కరిస్తున్నామని తెలిపారు. పాకిస్తాన్ ఇతరుల్ని నిందించడం మానేసి, తన భూభాగంలో పనిచేస్తున్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానాల్లో ఉపయోగించే ధోరణిని విడిచిపెట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Also Read
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్‌చేస్తే..
శనివారం సాయంత్రం కరాచీలోని గులిస్తాన్-ఇ-జౌహర్ ప్రాంతంలో ఉన్న సింధ్ రేంజర్స్ భిట్టై వింగ్ ప్రధాన కార్యాలయంపై భారీ ఆయుధాలతో వచ్చిన ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ప్రధాన గేటును వాహనంతో ఢీకొట్టి గ్రెనేడ్లు విసిరి, కాల్పులు జరిపారు. దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన కాల్పుల్లో నలుగురు రేంజర్స్ సిబ్బంది మరణించగా, ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడికి తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) అనుబంధ సంస్థ జమాత్-ఉల్-అహ్రార్ బాధ్యత వహించింది.
తాజావార్తలు
-
MEA: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
-
Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
-
Bank Holidays: జూలైలో బ్యాంక్‌లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్‌గా తెలుసుకోండి!
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!