Site icon NTV Telugu

Corona Virus: భారత్లో విజృంభిస్తున్న కరోనా.. ఒక్కరోజే ఎన్ని కేసులంటే..?

Carona

Carona

Corona Virus: కరోనా వైరల్ మరోసారి దేశ ప్రజల్ని కలవరపాటుకు గురి చేస్తోంది. భారత్‌లో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ బారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య సుమారు 6 వేల 133 కు చేరుకుంది. అంతే కాదు, గడిచిన 24 గంటల్లో 378 కొత్త కేసులు నమోదు కాగా.. ఆరుగురు కోవిడ్ తో మృతి చెందారు. కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు కరోనా వల్ల తుది శ్వాస విడిచారు. అయితే, ఇప్పటి వరకు కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 65కి చేరుకుంది. కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీలో అత్యధిక కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 86, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులను ఆరోగ్య శాఖ గుర్తించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేశారు.

Read Also: Prabhakar Rao : సిట్‌ ఆఫీసుకు ప్రభాకర్‌ రావు.. అధికారుల ప్రశ్నల వర్షం..!

ఇక, కేరళ రాష్ట్రంలోనే అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఆ తర్వాత గుజరాత్​, బెంగాల్, ఢిల్లీలో కూడా కేసులు ఎక్కువగా ఉన్నాయని రిపోర్టు విడుదల చేసింది. అయితే, ఇప్పటి వరకు కేరళలో 1957 పాజిటివ్ కేసులు ఉండగా.. గుజరాత్‌ 980, బెంగాల్​ 747, ఢిల్లీ 728, మహారాష్ట్ర 607 కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. అన్ని రాష్ట్రాల్లో వైద్య సౌకర్యాల తనిఖీ కోసం మాక్​ డ్రిల్​ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అంతేకాకుండా ఆక్సిజన్​, ఐసోలేషన్​ వార్డులు, వెంటిలేటర్లు, అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపింది.

Exit mobile version