NTV Telugu Site icon

English Language: ఆంగ్ల భాషలో భారత్‌ భేష్‌.. తొలి స్థానంలో ఢిల్లీ

English

English

English Language: ఇంగ్లిష్ భాష సంభాషణా నైపుణ్యంలో ప్రపంచ సగటు కంటే భారత్‌ మెరుగ్గా ఉందని ఓ అంతర్జాతీయ రిపోర్ట్ వెల్లడించింది. ఈ అంశంలో దేశంలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా సెకండ్ ప్లేస్ లో రాజస్థాన్‌ నిలిచింది. గ్లోబల్‌ ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ పేరుతో పియర్‌సన్‌ అనే సంస్థ ఈ సర్వే చేసింది. సోమవారం నాడు విడుదలైన ఈ నివేదికలో భారత్, ఫిలిప్పీన్స్, జపాన్, ఈజిప్ట్, కొలంబియా, యూరప్‌ దేశాల ప్రజల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాల పోకడపై రిసెర్చ్ చేశారు. ఆ అధ్యయనంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 7.50 లక్షల పరీక్షల ఫలితాలను సమీక్ష చేశారు.

Read Also: KTR: నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ!

కాగా, వెర్‌సాంట్‌ బై పియర్‌సన్‌’ పేరుతో నిర్వహించే ఈ ఎగ్జామ్స్ లో ఆంగ్ల భాషపై క్యాండిడెట్స్ కు ఉన్న పట్టును వారు పరీక్షించారు. దీని వల్ల వ్యాపార సంస్థలు నిపుణులైన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడంలో ఇది సహకరిస్తుంది. తాజా రిపోర్ట్ ప్రకారం.. ఇంగ్లిష్‌ భాషపై పట్టులో భారత్‌ స్కోరు (52) ప్రపంచ సగటు (57) రేటు కంటే కిందికి ఉంది. సంభాషణా నైపుణ్యంలో మాత్రం ప్రపంచ సగటు (54) కంటే ఎక్కువ (57) స్కోర్‌ చేసింది ఇండియా. ఇంగ్లిష్‌ రాయడంలో ప్రపంచ సగటు, భారత్‌ స్కోరు ఇక్వెల్ (61)గా ఉన్నాయి.

Read Also: Jasprit Bumrah Injury: ఇంగ్లండ్‌తో సిరీస్‌.. జస్ప్రీత్ బుమ్రా ఔట్!

అయితే, భారతదేశంలో చూసుకుంటే ఇంగ్లిష్ భాష సంభాషణ నైపుణ్యంలో మొదటి స్థానంలో ఢిల్లీ (63), ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్‌ (60), పంజాబ్‌ (58) కొనసాగుతున్నాయి. రంగాల వారీగా భారత్‌లో బ్యాంకింగ్, ఫైనాన్స్‌ రంగాలు ప్రపంచ సగటు కంటే అత్యధిక స్కోరును అధిగమించాయి. అన్ని రంగాల కంటే అట్టడుగున ఆరోగ్య రంగం (45) ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. ఇంగ్లిష్‌ స్కిల్స్‌కు భారత మార్కెట్‌లో ఫుల్ డిమాండ్‌ పెరిగిపోతుంది.. ఇది భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశం ఉందని పియర్‌సన్‌ నివేదికలో వెల్లడించింది.

Show comments