Cabinet Meeting: భారత్-పాక్ ఉద్రిక్తత.. రేపు ప్రధాని మోడీ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ..
- భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత..
- రేపు ప్రధాని మోడీ నేతృత్వంలో కీలక భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cabinet Meeting: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ కీలక సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షత ఈ సమావేశం జరుగబోతోంది. పాకిస్తాన్‌పై సైనిక చర్య తీసుకుంటారనే ఊహాగానాల నడుమ ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే, త్రివిధ దళాల అధిపతులు, ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్‌తో ప్రధాని మోడీ కీలక సమావేశాలు నిర్వహించారు. మరోవైపు భారత్ వరస ఆంక్షలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
క్యాబినెట్ సమావేశంలో భారత్, పాక్ ఉద్రిక్తత కీలకం కాబోతోంది. రేపటి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే, బుధవారం(రేపు) దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్‌కి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 259 ప్రదేశాల్లో మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. యుద్ధం వస్తే ప్రజలు తమని తాము ఎలా కాపాడుకోవాలనే దానిపై ఈ డ్రిల్స్ జరుగుతున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వరసగా సమావేశాలతో కేంద్రం బిజీగా ఉంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో ప్రధాని కీలక చర్చలు నిర్వహించారు. త్రివిధ దళాలతో ఇటీవల జరిగిన సమావేశంలో సైన్యానికి ప్రధాని పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఈ నేపథ్యంలో రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో పాకిస్తాన్ టార్గెట్‌గా కీలక నిర్ణయాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!