India-Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. ఆ సమయంలో రెండు అణ్వాయుధ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత, పాకిస్తాన్ కాల్పుల విమరణకు బ్రతిమిలాడటంతో, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. ఇదిలా ఉంటే, తాజాగా మరోసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 20 సాయంత్రం కుప్వారాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి)లోని నౌగామ్ సెక్టార్‌లో భారత్ మరియు పాకిస్తాన్ దళాల మధ్య కాల్పులు జరిగాయి. అయితే, ఈ సంఘటన కాల్పుల విరమణ ఉల్లంఘన కాదని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.
Read Also: Solar Eclipse 2025: సూర్యగ్రహణం ఎఫెక్ట్.. పలు దేశాలకు పొంచి ఉన్న ప్రమాదం!
“నియంత్రణ రేఖ వెంబడి రెండు వైపులా జరిగిన చిన్న ఆయుధాలతో కాల్పులు జరిగాయి. కాల్పుల విరమణ ఉల్లంఘన కాదు” అని వర్గాలు తెలిపాయి. తెలిసిన వివరాల ప్రకారం, సాయంత్రం 6.15 గంటలకు కాల్పులు ప్రారంభమై దాదాపు గంటసేపు అడపాదడపా కొనసాగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సంఘటనపై సైన్యం అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.