Manipur Visit: గత రెండున్నర నెలలుగా పైగా జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో ఇండియా ఎంపీలు పర్యటించనున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను పరిశీలించడం కోసం ఇండియా ఎంపీలు ఈ నెల 29 30 తేదిల్లో మణిపూర్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్నఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఈ నెల 29, 30న ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి చెందిన 20 మందికిపైగా ఎంపీల బృందం మణిపూర్‌లో పర్యటించి అక్కడి పరిస్థితిని తెలుసుకోనుంది.
Read also: Heavy Rains: వరదల్లో వరంగల్ దిగ్బంధం.. బిల్డింగ్ లపై తలదాచుకున్న బాధితులు
విపక్షాల కూటిమికి చెందిన 26 ప్రతిపక్ష పార్టీలు కలిసి ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్‌క్లూజీవ్ అలయెన్స్(ఇండియా)గా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇండియాకు చెందిన 20 మందికిపైగా ఎంపీల బృందం మణిపూర్‌లో పర్యటించి అక్కడి పరిస్థితిని తెలుసుకోనుందని లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మాణికం ఠాకూర్ తెలిపారు. మణిపూర్‌లో పర్యటించాలని ఎంపీలు ఎప్పటినుంచో భావిస్తున్నా.. భద్రతా కారణాల పేరుతో అధికారులు అనుమతి ఇవ్వలేదన్నారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో చర్చ చేపట్టాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నా.. అందుకు కేంద్రం అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రంపై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని సైతం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. అవిశ్వాస తీర్మానంపై చర్చకు లోక్‌సభ స్పీకర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మణిపూర్ రాష్ట్రంలోని మైతీ, కుకీ తెగల మధ్య ఘర్షణలతో మే 3 నుంచి రగులుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయిన విషయం తెలిసిందే. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నబీజేపీ ప్రభుత్వాల అలసత్వం కారణంగానే రాష్ట్రం అట్టుడుకుతున్నదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పరిస్థితులను తెలుసుకోవడం కోసం ప్రతిపక్ష ఇండియా ఎంపీలు రాష్ట్రంలో పర్యటించనున్నారు.