Indo-Pak: పాకిస్థాన్‌కు మళ్లీ భారత్ హెచ్చరికలు.. తావి నదిలో భారీగా వరదల ఉంటాయని వార్నింగ్
- పాకిస్థాన్‌కు మళ్లీ భారత్ హెచ్చరికలు
- తావి నదిలో భారీగా వరదల ఉంటాయని వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తావి నదిలో భారీగా వరదలు ముంచెత్తే అవకాశం ఉందని ఇటీవల పాకిస్థాన్‌ను భారత్ హెచ్చరించింది. తాజాగా మరోసారి ఇస్లామాబాద్‌కు వార్నింగ్ ఇచ్చింది. పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మానవతా దృక్పథంతో ఇస్లామాబాద్‌కు ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Tawi Bridge: జమ్మూను ముంచెత్తిన భారీ వర్షాలు.. చూస్తుండగానే కూలిన తావి వంతెన.. షాకింగ్ వీడియో
Also Read
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
- Samudra Manthan: మోడీ చెప్పిన ‘‘సముద్ర మంథన్’’ ప్రాజెక్ట్ ఏంటి..? లక్ష్యం సాధిస్తే భారత్‌కు తిరుగులేదు..
- Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
మంగళవారం జమ్మూలో కురిసిన భారీ వర్షాల కారణంగా తావి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. హిమాలయాల్లో ఉద్భవించిన ఈ నది జమ్మూ గుండా ప్రవహిస్తుంది. పాకిస్థాన్‌లోని చీనాబ్ నదిలో ఇది కలుస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రధాన ఆనకట్టల నుంచి అదనపు నీటిని విడుదల చేయాల్సి రావడంతో తావి నది మరింత ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో తావి నదిలో వరదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని బుధవారం మరోసారి పాకిస్థాన్‌కు భారతదేశం హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
ఇది కూడా చదవండి: Trump-Modi: మోడీకి ఫోన్ చేసి బెదిరించా.. పాక్‌తో యుద్ధం ఆపేశారు.. ట్రంప్ మళ్లీ అదే పాట
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాలను నిలిపివేసింది. అనంతరం ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే సరిహద్దు వెంబడి ఆస్తి, ప్రాణనష్టం జరగకూడదన్న కారణంతో వరద హెచ్చరికలు జారీ చేసినట్లు వర్గాలు పేర్కొన్నాయి. ఉత్తర భారతదేశం అంతటా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.
పంజాబ్‌లో సట్లెజ్, బియాస్, రావి నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. జమ్మూలో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కీలక జలాశయాల గేట్లను తెరవాల్సి వచ్చింది. దీంతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో ఇప్పటి వరకు 32 మంది చనిపోగా.. 20 మంది గాయపడ్డారు.
ఇక రావి నదిలోకి పెద్ద ఎత్తున వరద రావడంతో పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను ముంచెత్తింది. వారసత్వ ప్రదేశాలు రెండింటికీ నష్టం వాటిల్లుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?