India-Iran Relations: హార్ముజ్ దాటిన మరో ఎల్పీజీ ట్యాంకర్.. భారత్‌కు ‘‘విశిష్ట స్థానం’’ ఉందని ఇరాన్ సందేశం..

  • హార్ముజ్ దాటిని 7వ ఎల్పీజీ ట్యాంకర్..
  • భారత్‌కు ప్రత్యేక స్థానం ఉందంటూ ఇరాన్ మెసేజ్..
Lpg

Lpg

India-Iran Relations: భారత్‌కు మరో గుడ్ న్యూస్. హార్ముజ్ జలసంధి దాటి, భారత్‌కు 7వ ఎల్పీజీ ట్యాంకర్ గ్రీన్ సాన్వీ వస్తోంది. దీనిపై ఇరాన్ ప్రత్యేక సందేశాన్ని పంచించింది. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్.. ‘‘మన ఉమ్మడి చరిత్రలో భారతదేశానికి, ముఖ్యంగా గుజరాత్‌కు విశిష్ట స్థానం ఉంది’’ అని పేర్కొంది. ఎల్పీజీ ట్యాంకర్ భారత్‌కు రావడాన్ని భారత దౌత్య విజయానికి నిదర్శనమని గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘవి పోస్టు‌కు ఇరాన్ కాన్సులేట్ స్పందించి ఇలా ట్వీట్ చేసింది.

Read Also: SRH: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్.. ఇంటికెళ్లిపోయిన స్టార్ ప్లేయర్..

‘‘మన ఉమ్మడి చరిత్రలో భారతదేశానికి, ప్రత్యేకించి గుజరాత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. శతాబ్ధాల క్రితం మన దేశ ప్రజల్ని ఆప్యాయంగా స్వాగతించింది’’ అని గుజరాత్ కాన్సులేట్ జనరల్ పేర్కొంది. ఈ ట్వీట్ సింధూలోయ, ఇరాన్ నాగరికతలను ఉద్దేశించి ఇరాన్ ట్వీట్ చేసినట్లుంది. ఆ సమయంలో గుజరాత్‌లోని లోథాల్ ఓడరేవు ద్వారా అప్పటి పర్షియా(ఇరాన్) వ్యాపారం, వాణిజ్యం నిర్వహించేంది. ‘‘ఈ శాశ్వత నాగరిక బంధం ఆధారంగా స్నేహ, సహకార సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాము’’ అని ఇరాన్ తెలిపింది.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడుల తర్వాత కీలక నౌకామార్గమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేసింది. అయితే, భారత్, చైనా లాంటి మిత్రదేశాలకు మాత్రం ఈ మార్గం ఓపెన్ చేసి ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. తాజాగా 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో ‘‘గ్రీన్ సాన్వీ’’ భారత్‌కు వస్తోంది. ఇప్పటి వరకు హార్ముజ్ జలసంధిని 7 ఎల్పీజీ నౌకలు దాటాయి. సుమారు 17 భారతీయ నౌకలు ఇంకా చిక్కుకుపోయాయి.