SRH: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్.. ఇంటికెళ్లిపోయిన స్టార్ ప్లేయర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్ మొదట్లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ అనూహ్యంగా స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. దీంతో సీజన్ తొలి భాగంలో కమిన్స్ అందుబాటులో ఉండరనే వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆయన తొలి రెండు మ్యాచ్ లకు దూరం అయిన సంగతి తెలిసిందే.
పాట్ కమిన్స్ గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. జూలై 2025 నుంచి ఈ గాయం అతడిని వేధిస్తోంది. ఐపీఎల్ కోసం భారత్‌కు వచ్చినప్పటికీ.. ప్రాక్టీస్ సెషన్లలో నొప్పి తీవ్రతరం కావడంతో మెరుగైన చికిత్స , విశ్రాంతి కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సూచన మేరకు ఆయన తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన సిడ్నీలో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందనున్నారు.
Also Read
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
- Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
- Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
SRHలో చేరిక ఎప్పుడు..?
కమిన్స్ గైర్హాజరీ వల్ల సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ డైలమాలో పడింది. తాజా సమాచారం ప్రకారం, ఆయన కోలుకోవడానికి కనీసం కొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉంది. అన్నీ అనుకూలిస్తే, ఏప్రిల్ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో అంటే టోర్నమెంట్ రెండో భాగంలో ఆయన మళ్ళీ జట్టుతో కలిసే అవకాశం ఉంది. అప్పటివరకు జట్టుకు కెప్టెన్‌గా ఇషన్ కిషన్ వ్యవహరిస్తు్న్న సంగతి తెలిసిందే.
Also Read:Iran War: యూఏఈపై 450 క్షిపణి, 2,000 డ్రోన్ దాడులు.. అయినా యూఏఈ ఇరాన్‌తో ఎందుకు పోరాడటం లేదు..?
గత సీజన్లలో కమిన్స్ తన అద్భుతమైన నాయకత్వంతో సన్‌రైజర్స్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లారు. కేవలం బౌలర్‌గానే కాకుండా, లోయర్ ఆర్డర్‌లో మెరుపు బ్యాటింగ్‌తోనూ ఆయన జట్టుకు వెన్నెముకగా నిలిచారు. ఇప్పుడు కీలకమైన తొలి మ్యాచులకు ఆయన లేకపోవడం జట్టు వ్యూహాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్ల కోటాలో కమిన్స్ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కాదు.
సన్‌రైజర్స్ అభిమానులు తమ ‘కెప్టెన్’ త్వరగా కోలుకుని మైదానంలోకి రావాలని కోరుకుంటున్నారు. టోర్నీ రెండో సగంలోనైనా ఆయన పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి వస్తే, జట్టు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి కమిన్స్ ఆస్ట్రేలియాలో ఉండి తన రికవరీపై దృష్టి సారించనున్నారు.
తాజావార్తలు
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్‌లో సమస్యలే
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?