Guinnis Record: ఏకధాటిగా పొడవైన రోడ్డు నిర్మాణం.. గిన్నిస్ బుక్‌లోకి భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే వరుసలో ఏకధాటిగా 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణాన్ని నాలుగు రోజుల్లోనే పూర్తి చేసింది. దీంతో ఖతార్‌పేరుతో ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది. ఈ మేరకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్‌ను, రోడ్డు నిర్మాణ ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. ఇంతటి గొప్ప పనిలో రాత్రి, పగలు భాగమైన ఇంజనీర్లు, కార్మికులకు ధన్యావాదాలు నితిన్ గడ్కరీ తెలిపారు. వారి దృఢసంకల్పం, చెమటధారతోనే నవ భారత నిర్మాణం సాధ్యమవుతోందని అభిప్రాయపడ్డారు. ఈ గొప్ప పనికి దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొన్నారు.
Wife Harassing Husband: దేశం కోసం పోరాడాడు.. భార్య వేధింపులకు బలయ్యాడు
Also Read
- Annamalai: బీజేపీకి గుడ్‌బై చెప్పనున్న అన్నామలై.. సొంత పార్టీపై ఫోకస్
- Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
- Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
- Lalit Modi: 'ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు', సుష్మితా సేన్‌తో తన బ్రేకప్‌పై మౌనం వీడిన లలిత్ మోడీ..
కాగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI), రాజ్ పథ్ ఇన్ ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్, జగదీశ్ కదమ్ సంస్థలు కలిసి 53వ నంబర్ జాతీయ రహదారిపై 75 కిలోమీటర్ల పొడవునా ఏకధాటిగా సింగిల్ లైన్ స్ట్రెచ్ రోడ్డును నిర్మించారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి అకోలా జిల్లాల మధ్య ఈ రహదారిని నిర్మించారు. జూన్ 3వ తేదీ ఉదయం 6 గంటలకు రోడ్డు నిర్మాణం ప్రారంభించి నుంచి జూన్ 6వ తేదీ కల్లా పూర్తి చేశారు. 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డును 105 గంటల 33 నిమిషాల్లో పూర్తి చేసినట్లు గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్లో పొందుపరిచారు. గతంలో ఈ రికార్డు ఖతార్‌కు చెందిన పబ్లిక్ వర్క్ అథారిటీ ASHDHAL పేరిట ఉంది. ఖతార్ అప్పట్లో 75 కి.మీ పొడవైన రోడ్డు నిర్మాణాన్ని 10 రోజుల్లో పూర్తి చేసింది.
Proud Moment For The Entire Nation!
Feel very happy to congratulate our exceptional Team @NHAI_Official, Consultants & Concessionaire, Rajpath Infracon Pvt Ltd & Jagdish Kadam, on achieving the Guinness World Record (@GWR) of laying 75 Km continuous Bituminous Concrete Road… pic.twitter.com/hP9SsgrQ57
— Nitin Gadkari (@nitin_gadkari) June 8, 2022
తాజావార్తలు
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Annamalai: బీజేపీకి గుడ్‌బై చెప్పనున్న అన్నామలై.. సొంత పార్టీపై ఫోకస్
-
TDP SIR Workshop: ఎస్ఐఆర్పై టీడీపీ ప్రత్యేక వర్క్‌షాప్.. కూటమి సమన్వయమే తొలి పరీక్ష!
-
Best Hollywood Action Thrillers: థియేటర్లను షేక్ చేసిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లు… వీటిలో ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది భయ్యా
-
ICC: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్లో భారీ మార్పు.. డే టెస్టుల్లో పింక్ బాల్ ట్రయల్.!
ట్రెండింగ్
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!