NTV Telugu Site icon

Guinnis Record: ఏకధాటిగా పొడవైన రోడ్డు నిర్మాణం.. గిన్నిస్ బుక్‌లోకి భారత్

Guinnis Record Min

Guinnis Record Min

భారత్‌లోని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే వరుసలో ఏకధాటిగా 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణాన్ని నాలుగు రోజుల్లోనే పూర్తి చేసింది. దీంతో ఖతార్‌పేరుతో ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది. ఈ మేరకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. గిన్నిస్‌ రికార్డ్‌ సర్టిఫికెట్‌ను, రోడ్డు నిర్మాణ ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇంతటి గొప్ప పనిలో రాత్రి, పగలు భాగమైన ఇంజనీర్లు, కార్మికులకు ధన్యావాదాలు నితిన్ గడ్కరీ తెలిపారు. వారి దృఢసంకల్పం, చెమటధారతోనే నవ భారత నిర్మాణం సాధ్యమవుతోందని అభిప్రాయపడ్డారు. ఈ గొప్ప పనికి దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొన్నారు.

Wife Harassing Husband: దేశం కోసం పోరాడాడు.. భార్య వేధింపుల‌కు బ‌ల‌య్యాడు

కాగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI), రాజ్ పథ్ ఇన్ ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్, జగదీశ్ కదమ్ సంస్థలు కలిసి 53వ నంబర్ జాతీయ రహదారిపై 75 కిలోమీటర్ల పొడవునా ఏకధాటిగా సింగిల్ లైన్ స్ట్రెచ్ రోడ్డును నిర్మించారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి అకోలా జిల్లాల మధ్య ఈ రహదారిని నిర్మించారు. జూన్ 3వ తేదీ ఉదయం 6 గంటలకు రోడ్డు నిర్మాణం ప్రారంభించి నుంచి జూన్ 6వ తేదీ కల్లా పూర్తి చేశారు. 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డును 105 గంటల 33 నిమిషాల్లో పూర్తి చేసినట్లు గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్‌లో పొందుపరిచారు. గతంలో ఈ రికార్డు ఖతార్‌కు చెందిన పబ్లిక్ వర్క్ అథారిటీ ASHDHAL పేరిట ఉంది. ఖతార్ అప్పట్లో 75 కి.మీ పొడవైన రోడ్డు నిర్మాణాన్ని 10 రోజుల్లో పూర్తి చేసింది.