Rare earth elements: భారత్‌కు భారీ జాక్‌పాట్.. ఏకంగా మిలియన్ టన్నుల “అరుదైన ఖనిజాలు”..
- భారత్‌కు భారీ జాక్‌పాట్..
- కర్ణాటకలో మిలియన్ టన్నుల ‘‘రేర్ ఎర్త్ ఖనిజాలు’’..
- చైనాపై ఆధారపడటం తగ్గే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rare earth elements: ప్రస్తుతం, ప్రపంచ జియోపాలిటిక్స్ ‘‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’’ చుట్టూ జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ అరుదైన భూ ఖనిజాల వెలికితీత, వీటి ద్వారా రేర్ ఎర్త్ అయస్కాంతాల తయారీలో చైనా గుత్తాధిపత్యం ఉంది. అయితే, ఇప్పుడు అమెరికా కూడా రేర్ ఎర్త్స్ కోసం అన్వేషిస్తోంది. ఉక్రెయిన్‌తో డీల్ అయినా, పాకిస్తాన్‌తో స్నేహమైన ఈ ఖనిజాల కోసమే. ఎలక్ట్రిక్ వాహన ఇండస్ట్రీ నుంచి క్షిపణులు, శాటిలైట్ల తయారీలో ఇవి కీలకంగా మారడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఖనిజాల కోసం పోటీ నెలకొంది. ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు భారత్ కూడా వడివడిగా అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ఖనిజాల కోసం అన్వేషణ సాగిస్తోంది.
Read Also: Ind vs NZ 3rd T20I: భారత్ బౌలర్ల ధాటికి కివీస్ విలవిలా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే, ఇప్పుడు భారత్ భారీ జాక్‌పాట్ కొట్టింది. కర్ణాటకలో చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేటలో భారీగా ‘‘రేర్ ఎర్త్ ఖనిజాల’’ నిల్వలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దేశ ఖనిజ సంపద, వ్యూహాత్మక స్వావలంబనకు ఇవి కీలకం కానున్నాయి. ప్రాంతంలో 63.5 లక్షల టన్నుల అరుదైన భూమి మూలకాలు, యట్రియం భారీ నిల్వలు గుర్తించబడ్డాయి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU) భూగర్భ శాస్త్ర విభాగం శాస్త్రవేత్తలు వీటిని గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాథమిక అంచనాలు కూడా వీటికి మద్దతు ఇస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ పరికరాలు, ఏరోస్పేస్, విండ్ టర్బైన్‌లు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ఆధునిక పరిశ్రమలలో రేర్ ఎర్త్ మూలకాలను ఉపయోగిస్తారు. ప్రస్తుతం, వీటి కోసం భారత్ చైనాపై ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో వీటిని గుర్తించడం భారత వ్యూహాత్మక, సాంకేతిక స్వావలంబనకు ఈ ఆవిష్కరణ దోహదపడనునంది.
గుండ్లుపేట ప్రాంతంలో అరుదైన కార్బోనటైట్ సైనైట్ సముదాయాన్ని గుర్తించారు. ఈ ప్రాంతంలోని ఈ రేర్ ఎర్త్ నిల్వలు 2.5 బిలియన్ ఏళ్ల సంవత్సరాల కన్నా పురాతనమైనవి. మొదటిదశలో గులాబీ రంగు సైనైట్ శిలలు ఏర్పడ్డాయని, దాదాపు 12 కోట్ల సంవత్సరాల తర్వాత, రెండో దశలో తెల్లని కార్బోనాటైట్ శిలలు అంతర్గతంగా ప్రవేశించినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ప్రాంతంలో సీరియం, లాంథనం, నయోబియం, ఫాస్పరస్ వంటి విలువైన రేర్ ఎర్త్ మూలకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతదేశంలో ఇప్పటికే గుజరాత్ (అంబా డోంగర్), రాజస్థాన్ (న్యువానియా), తమిళనాడు (హోగెనక్కల్, సేవత్తూర్), మేఘాలయ (సంగ్ వ్యాలీ) వంటి ప్రాంతాల్లో కూడా కార్బోనాటైట్ సముదాయాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!