NTV Telugu Site icon

PM Modi: భారత్‌ ఈ ప్రపంచానికి ఆశాకిరణంలా కనిపిస్తోంది..

Modi Pm

Modi Pm

PM Modi: ప్రపంచ దేశాలు మొత్తం కరోనా, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలతో ఇబ్బంది పడుతున్న వేళ కూడా మన దేశంలో ‘భారత్‌ శతాబ్ది’ గురించి ఆలోచిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. అయితే, ‘ది ఎన్డీటీవీ వరల్డ్‌ సమ్మిట్‌’లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచానికి భారత్‌ ఆశాకిరణంలా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. దేశం ప్రతి రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన మా ప్రభుత్వం ఇప్పటికే 125 రోజులు పూర్తి చేసుకొంది అని వెల్లడించారు. ఈ కాలంలో మా ప్రభుత్వ అనుభవాన్ని మీతో పంచుకుంటాను అని మోడీ తెలిపారు.

Read Also: Hug Time: ఎయిర్‌పోర్టులో వింత నిబంధన.. వీడ్కోలు కౌగిలింతకు కూడా టైం లిమిట్

ఇక, పేదలకు 3 కోట్ల కొత్త పక్కా గృహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోడీ తెలిపారు. రూ.9 లక్షల కోట్ల ఇన్ఫ్రా ప్రాజెక్టులపై పని స్టార్ట్ అయింది.. 15 వం దేభారత్‌ రైళ్లను ఇప్పటికే ప్రారంభించాం.. 8 కొత్త ఎయిర్‌ పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.. యువతకు రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చామన్నారు. అలాగే, రైతుల ఖాతాల్లో 21 వేల కోట్ల రూపాయలను బదిలీ చేశామని ఆయన వెల్లడించారు. ఇక, 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత వైద్యానికి ఏర్పాట్లు చేస్తున్నాం.. 5 లక్షల ఇళ్లలో రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. స్టాక్‌మార్కెట్‌ సూచీల్లో దాదాపు 7 శాతం వృద్ధి నమోదు కాగా.. విదేశీ మారకద్రవ్యం 700 బిలియన్‌ డాలర్లను దాటేసిందన్నారు. నేను కేవలం 125 రోజుల్లో జరిగిందే చెప్తున్నాను అని నరేంద్ర మోడీ తెలిపారు.

Read Also: CM Revanth Reddy: వీర మరణం పొందిన పోలీసు కుటుంబాలకు కోటి పరిహారం.. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం..

అయితే, ఈ సమయంలో భారత్‌లో ప్రపంచం మూడు విషయాలు చర్చించడానికి వచ్చింది అని ప్రధాన మంత్రి మోడీ తెలిపారు. టెలికామ్‌-డిజిటల్‌ ఫ్యూచర్‌పై అంతర్జాతీయ అసెంబ్లీ కొనసాగింది.. గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ నిర్వహించాం.. గ్లోబల్‌ సెమీకండెక్టర్‌ ఎకోసిస్టమ్‌పై సమ్మిట్ కూడా జరిగిందన్నారు. ఇవి భారత్‌ దిశ.. ప్రపంచం ఆశను తెలియజేస్తుందన్నారు. ప్రపంచ భవిష్యత్తును భారతదేశం నిర్ణయిస్తుంది. మా ప్రభుత్వ మూడో విడత పాలనతో రేటింగ్‌ ఏజెన్సీలు దేశ వృద్ధి రేటును గణనీయంగా పెంచాయని మోడీ చెప్పుకొచ్చారు.

Read Also: Bigg Boss 8 Telugu: నాగమణికంఠ అవుట్.. రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడంటే?

అలాగే, భారత్‌ వేగంగా వృద్ధి చెందుతున్న దేశమని నరేంద్ర మోడీ తెలిపారు. దేశంలోని పేద ప్రజల కష్టాలు తమకు బాగా తెలుసన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ఆయన సదస్సులో పాల్గొనడానికి వచ్చిన విదేశీ అతిథులను కలిశారు. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్ లో యూకే మాజీ ప్రధాని డేవిడ్‌ కామరూన్‌, భూటాన్‌ ప్రధాని దాసో త్సేరింగ్‌ టోబ్గే, విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిట్టల్ తదితరులు పాల్గొనే అవకాశం ఉంది.

Show comments