Emergency Alert: మీ మొబైల్స్ పెద్ద శబ్దంతో మోగాయా? కంగారు పడకండి.. మేటరేంటంటే..!
- మీ మొబైల్స్ పెద్ద శబ్దంతో మోగాయా?
- కంగారు పడకండి
- సందేశం ఉద్దేశం ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా శనివారం ఉదయం 11:41 గంటలకు అన్ని మొబైల్స్ పెద్ద శబ్దంతో మార్మోగాయి. అన్ని ఫోన్లు ఒకేసారి సౌండ్ చేయడంతో ఒకింత ఆందోళనకు గురయ్యారు. కొందరికి అసలు విషయం తెలియక భయాందోళన చెందారు. విద్యావంతులకు అసలు విషయం తెలియడంతో లైట్ తీసుకున్నారు కానీ.. సామాన్య ప్రజలు మాత్రం ఝలక్‌కు గురయ్యారు.
అయితే అసలు విషయాన్ని కొస్తే భారత ప్రభుత్వం అన్ని మొబైల్స్‌కు ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేసింది. విపత్తు సమయంలో ఉపయోగపడేలా.. హెచ్చరిక సేవను పరీక్షించడానికి భారత ప్రభుత్వం శనివారం ఉదయం ఈ సందేశాన్ని పంపింది.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ పాస్‌పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
- Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
సందేశంలో ఇలా ఉంది.. ‘‘భారతదేశం తన పౌరుల కోసం తక్షణ విపత్తు హెచ్చరిక సేవ నిమిత్తం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెల్ బ్రాడ్‌కాస్ట్‌ను ప్రారంభించింది. పౌరులను అప్రమత్తం చేయడం. దేశాన్ని సురక్షితం చేయడం. ఈ సందేశాన్ని అందుకున్న తర్వాత ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పరీక్షా సందేశం.’’ అని భారత ప్రభుత్వం పేర్కొంది.
ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో 2026 మే 2న మొబైల్ ఆధారిత విపత్తు సమాచార వ్యవస్థను ప్రారంభించారు. పౌరులకు కీలక సమాచారాన్ని సకాలంలో చేరవేసేందుకు, సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT), భారత ప్రభుత్వ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) సహకారంతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహాయ కమిషనర్లు/కార్యదర్శులు (విపత్తు నిర్వహణ), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు, అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ మరియు హోం గార్డుల అధిపతుల 2026 వార్షిక సమావేశంలో అమిత్ షా సమక్షంలో ఈ పరీక్ష హెచ్చరిక సందేశం పంపబడింది.
ఎందుకీ పరీక్ష..
ప్రతి దేశంలోనూ.. విపత్తు లేదా క్లిష్ట పరిస్థితి సమయంలో ప్రభుత్వం పౌరులకు వీలైనంత త్వరగా సమాచారాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది. పౌరులను త్వరగా అప్రమత్తం చేయడానికి ఫోన్ మాత్రమే ఏకైక సాధనం. ఈ కారణంగా కష్ట సమయాల్లో ప్రజలను సకాలంలో అప్రమత్తం చేయడానికి వీలుగా.. భారత ప్రభుత్వం మొబైల్ ఆధారిత విపత్తు సమాచార వ్యవస్థను పరీక్షించింది.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ పాస్‌పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
-
Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
-
China: జిన్‌పింగ్‌కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
-
DSP transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!