Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 ఫస్ట్ హాఫ్‌లో భారీ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు సెకండ్ హాఫ్‌లో టాలీవుడ్ ఆశలన్నీ ఆరు పెద్ద సినిమాల పైనే ఉన్నాయి. ఫౌజీ, విశ్వంభర, ఆదర్శ కుటుంబం, కింగ్ 100, ది పారడైజ్, రణబలి.. ఈ సినిమాల బడ్జెట్ దాదాపు 2000 కోట్లకు చేరువలో ఉంది. రికవరీ ఆ రేంజ్‌లోనే ఉంటుందా? ఈ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీని గట్టెక్కిస్తాయా, లేక మరొకసారి భారీ నష్టాలకు కారణం అవుతాయా?
ప్రభాస్ ‘ఫౌజీ’ పై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్లో గ్రాండ్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. హను రాఘవపూడి కెరీర్లోనే అతి పెద్ద సినిమా ఇది. 1940 కాలం నాటి స్టోరీ, కానీ పీరియడ్ సినిమాలకు భారీ బడ్జెట్, ఎక్కువ రన్‌టైం, అంతర్జాతీయ స్థాయి విజువల్స్ అవసరం. అందుకే ‘ఫౌజీ’ బడ్జెట్ 600 కోట్లు దాటింది. దీంతో హిట్ సరిపోదు, బ్లాక్‌బస్టర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
మరోవైపు చిరంజీవి ‘విశ్వంభర’ కూడా పలుమార్లు వాయిదా పడింది. విఎఫ్ఎక్స్ మీద భారీగా ఖర్చు చేశారు. విజువల్స్ ఆకట్టుకున్నా, కథ బలహీనంగా ఉంటే ప్రేక్షకులు అంగీకరించే పరిస్థితి లేదు. బడ్జెట్ మాత్రం 400 కోట్లకు చేరుకుందని టాక్, రిలీజ్ అయితే గానీ రిజల్ట్ చెప్పలేని పరిస్థితి.
వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తుంది. అయితే బడ్జెట్ మాత్రం 100 కోట్లు దాటింది. అక్టోబర్ 2న థియేటర్స్‌లోకి వస్తుంది. ఓటిటీల ప్రభావంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడం ఇప్పుడంత సులభం కాదు, కానీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో పై చాలా క్రేజ్ ఉంది.
ఇక నాగార్జున కెరీర్లో 100వ సినిమాపై ప్రత్యేక దృష్టి ఉంది. ఆయన కెరీర్లో మైల్స్టోన్ సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. కానీ గత కొన్నేళ్లుగా నాగార్జునకు బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ లేకపోవడం ఒక మైనస్, అదే సమయంలో దసరా పోటీలో పెద్ద సినిమాల మధ్య వస్తే కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది.
దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబో పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ అదే అంచనాలు ‘ది పారడైజ్’ పై ప్రెజర్‌గా మారుతున్నాయి. పైగా ఇప్పటివరకు నాని కెరీర్లోనే బడ్జెట్ 200 కోట్లు దాటిన సినిమా ఇదే. నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ఆగస్టు 21న విడుదల కావాల్సిన ఈ చిత్రం సెప్టెంబర్ 25కు వాయిదా పడింది. అంటే సినిమా క్వాలిటీ పై మేకర్స్‌కు నమ్మకం ఉన్నా, పెరిగిన బడ్జెట్, బాక్సాఫీస్ కలెక్షన్లపై అంచనాలు, వాయిదా పడ్డ రిలీజ్.. ఇవే ఇప్పుడు ‘ది పారడైజ్’ మూవీ పై ప్రెజర్ తీసుకొస్తున్నాయి. ఈ సినిమా కేవలం హిట్ అయితే సరిపోదు, భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించాలి. అప్పుడే పారడైజ్ నిర్మాతలకు లాభాలు వస్తాయి.
మరోవైపు విజయ్ దేవరకొండ వరుస ఫ్లాప్‌లతో ఫైట్ చేస్తున్నాడు. అయినా సరే 150 కోట్ల బడ్జెట్‌తో సెప్టెంబర్ 11న ‘రణబలి’తో వస్తున్నాడు. ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ అయితే తప్ప తన మార్కెట్ నిలబడదు. ఫౌజీ, విశ్వంభర, ది పారడైజ్, రణబలి, ఆదర్శ కుటుంబం, కింగ్ 100.. ఈ ఆరు సినిమాలు కేవలం రిలీజ్ కావడమే కాదు, బ్లాక్‌బస్టర్ సక్సెస్ కావాలి. అప్పుడే ఇండస్ట్రీకి ఊరట, లేదంటే 2026 ఫస్ట్ హాఫ్ లాగా సెకండ్ హాఫ్ కూడా వెలవెలబోతుంది.
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!