Site icon NTV Telugu

Hypersonic missiles: ‘‘ప్రాజెక్ట్ విష్ణు’’తో పాక్, చైనాలో వణుకు.. 12 రకాల హైపర్ సోనిక్ క్షిపణుల్ని రెడీ చేస్తున్న భారత్..

Hypersonic Missiles

Hypersonic Missiles

Hypersonic missiles: ఓ వైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, కొత్తగా ఇప్పుడు బంగ్లాదేశ్.. ఇలా భారత్ చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి. అయితే, వీటిని సమర్థవంతంగా అడ్డుకునేందుకు భారత్ ఇటీవల కాలంలో తన ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ స్వదేశీ ఆయుధాల సత్తా పాకిస్తాన్, చైనాలకు తెలిసి వచ్చింది. ఇక ముందు కూడా ఈ రెండు దేశాలకు భయపడేలా భారత్ పెద్ద ప్రాజెక్టుకే శ్రీకారం చుట్టింది.

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ‘‘ప్రాజెక్టు విష్ణు’’పై పని చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ‘‘హైపర్ సోనిక్ మిస్సైల్స్’’ని డెవలప్ చేస్తోంది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతో వీటిని అభివృద్ధి చేస్తోంది. ఇది మొత్తం ఆసియాలోనే పవర్ బ్యాలెన్స్‌ని ఛేంజ్ చేయగలదు. ఈ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న ET-LDHCM వంటి క్షిపణులు మాక్ 8 (సుమారు గంటకు 10,000 కి.మీ.) వేగాన్ని తాకగలవు. దీంతో భారత్ హైపర్ సోనిక్ క్షిపణులు ఉన్న అమెరికా, రష్యా, చైనా జాబితాలో చేరుతుంది.

Read Also: Madhya Pradesh: 4 లీటర్ల పేయింట్ వేయడానికి 233 మంది వ్యక్తులా.? ఇదేం దోపిడి భయ్యా..

ప్రాజెక్టు విష్ణు కింద డీఆర్డీఓ ఏకంగా 12 రకాల హైపర్‌సోనిక్ క్షిపణి వ్యవస్థల్ని తయారు చేస్తోంది. ఈ 12 మిస్సైల్స్ శత్రువుల క్రూయిజ్ లేదా బాలిస్టిక్ మిస్సైళ్లను అడ్డగించి నాశనం చేయడంతో పాటు శత్రువులపై అటాకింగ్ మిస్సైల్స్‌గా కూడా పనిచేస్తాయి. ఈ మిస్సైళ్లు ఇంటర్‌సెప్టర్ క్షిపణులుగా పనిచేస్తాయంటే, ఎయిర్ డిఫెన్స్ కూడా ఉంటుందని అర్థం. డీఆర్డీఓ 2030 ముందే హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికిల్స్‌ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అత్యధిక వేగం ఉన్న ఈ మిస్సైళ్లను అడ్డుకోవడం దాదాపు అసాధ్యం.

ఇప్పటి వరకు ప్రపంచంలో 3 దేశాలు- అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ఈ సాంకేతికత ఉంది. భారత్ చేపట్టిన ప్రాజెక్టు కింద డెవలప్ చేస్తున్న మిస్సైల్స్ 1000 నుంచి 2000 కి.మీ బరువు ఉన్న సాంప్రదాయ లేదా అణు వార్ హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటాయి.

Exit mobile version