ఇండియాలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఇన్ని కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న మరణాలు మాత్రం తగ్గలేదు. కానీ ఈరోజు మరణాల సంఖ్య భారీగా తగ్గింది. తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,40,842 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,65,30,132 కి చేరింది. ఇందులో 2,34,25,467 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 28,05,399 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 3,741 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,99,266 కి చేరింది. ఇక 24 గంటల్లో 3,55,102 మంది కరోనా నుంచి కోలుకున్నారు.