Site icon NTV Telugu

Corona Cases: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

India Corona Cases

India Corona Cases

Corona Cases: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 20,528 కేసులు నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 16,935 పాజిటివ్ కేసులు మాత్రమే వెలుగుచూశాయి. ఇటీవల క్రమంగా పెరుగుతున్న కేసులు గత 24 గంటల్లో 3వేల వరకు తగ్గడంతో కొంత ఉపశమనం లభించినట్లు భావించవచ్చు. మరోవైపు తాజాగా 51 మంది కరోనా బారినపడి చనిపోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 16,069 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.47 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 6.48 శాతానికి పెరిగింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు దేశంలో 2,61,470 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.

Schools Are Open From Today: వారం తర్వాత.. నేటి నుంచి స్కూల్స్‌ పునఃప్రారంభం..

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,25,760 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,44,264 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,30,97,510 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో భారత్‌లో4,46,671 మందికి కరోనా వ్యాక్సిన్‌లు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 200 కోట్లు దాటింది. అటు ప్రపంచ దేశాల్లో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 5,30,140 మంది కరోనా వైరస్​ బారినపడ్డారు. మరో 628 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

Exit mobile version