Corona Cases: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నిన్నటితో పోల్చితే కాస్త తగ్గాయి. శుక్రవారం 15,754 కేసులు నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 13,272 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరోవైపు తాజాగా 36 మంది కరోనా బారినపడి చనిపోయారు. కొవిడ్ నుంచి తాజాగా 13,900 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.58 శాతానికి చేరింది. యాక్టివ్ కేసులు 0.23 శాతం, డైలీ పాజిటివిటీ రేటు 4.21 శాతానికి పెరిగాయి. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు దేశంలో 3,15,231 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
Janmashtami: జన్మాష్టమి వేడుకల్లో అపశ్రుతి.. రద్దీ కారణంగా ఊపిరాడక ఇద్దరు మృతి
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,27,289 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,01,166 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,36,99,435 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 13,15,536 మందికి కరోనా వ్యాక్సిన్‌లు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 209.40 కోట్లు దాటింది. అటు ప్రపంచ దేశాల్లో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 7 లక్షల 40 వేలకుపైగా మంది కరోనా వైరస్ బారినపడ్డారు. మరో 2000 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.