భారత్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా 1,94,720 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే ఈరోజు కేసుల సంఖ్య 15.8 శాతం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు, దేశంలో పాజిటివిటీ రేటు పది శాతం దాటిపోయింది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 9,55,319 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 442 మంది మృతి చెందగా, 60,405 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. దేశంలో మొత్తం 4,868 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. సోమ, మంగళ వారాల్లో కొంతమేర కేసులు తగ్గుముఖం పట్టగా, బుధవారం రోజున కేసులు భారీగా పెరడగంతో మళ్లీ ఆందోళన మొదలైంది.
Read: అద్భుతం: ఐవీఎఫ్ పద్దతిలో లేగదూడ జననం… దేశంలోనే తొలిసారి…
థర్డ్ వేవ్ ప్రభావం స్పష్టంగా నిపుణులు చెబుతున్నారు. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. 120 జిల్లాల్లో రోజూ 10 శాతం మేర పాజిటివిటీ రేటు నమోదవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మాస్క్ ధరించడం, వ్యాక్సిన్ తీసుకోవడం వంటివి చేయడం వలన కరోనా నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. రేపు దేశంలోని ముఖ్యమంత్రులతో ప్రధాని బేటీ కానున్నారు. ఒమిక్రాన్ వేరయంట్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.