అద్భుతం: ఐవీఎఫ్ ప‌ద్ద‌తిలో లేగ‌దూడ జ‌న‌నం… దేశంలోనే తొలిసారి…

ఇటీవ‌ల కాలంలో దేశంలో ఐవీఎఫ్ విధానం బాగా పాపుల‌ర్ అయింది.  పిల్ల‌లు లేనివారు ఈ ప‌ద్ద‌తి ద్వారా పిల్ల‌ను కంటున్నారు.  అండాల‌ను, శుక్ర‌క‌ణాల‌ను సేకరించి ప్ర‌త్యేక ప‌ద్ద‌తితో ల్యాబ్‌లో ఫ‌ల‌దీక‌ర‌ణం చేసి ఆ త‌రువాత అ అండాన్ని వేరొక‌రి గ‌ర్భాశయంలోకి ప్ర‌వేశ‌పెడ‌తారు.  అక్క‌డ అండం పిండంగా మారుతుంది.  ఇప్పుడు ఈ కృత్రిమ ప‌ద్ద‌తి విధానాన్ని అరుదైన జంతువుల జాతిని పెంచేందుకు కూడా వినియోగిస్తున్నారు.  దేశంలో అత్యంత అరుదైన జాతికి చెందిన ప‌శువుల్లో పుంగ‌నూరు జాతి ఆవులు కూడా ఉన్నాయి.  ఈ జాతికి చెందిన ఆవులు చాలా పొట్టిగా ఉంటాయి.  ఈ జాతికి చెందిన ప‌శువులు కేవలం 500 వ‌ర‌కు మాత్ర‌మే ఉన్న‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.  దీంతో ఈ జాతికి చెందిన ప‌శువుల‌ను పెంచేందుకు మ‌హారాష్ట్ర‌ శాస్త్ర‌వేత్త‌లు సిద్ద‌మ‌య్యారు.  

Read: ఒమిక్రాన్‌… ఓ అన్‌స్టాప‌బుల్ వేరియంట్‌…

మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్‌కు చెందిన ప‌శువ‌ర్ద‌క శాస్త్ర‌వేత్త‌లు కృత్రిమ ప‌ద్ద‌తిలో ఐవీఎఫ్ విధానంలో లేగ‌దూడ జ‌న్మించింది.  ఈ ప‌ద్ద‌తిలో జ‌న్మించిన తొలి దూడ ఇదే కావ‌డం విశేషం.  పుంగ‌నూరు ఆవు పాల‌లో విశేష‌మైన ఔష‌ద‌గుణాలు ఉంటాయని, ఆ జాతికి చెందిన ఆవులు ప‌లు కార‌ణాల వ‌ల‌న అంత‌రించి పోతున్నాయ‌ని, వాటిని కాపాడేందుకు సాంకేతిక విధానాన్ని అవ‌లంభిస్తున్నామ‌ని అధికారులు చెబుతున్నారు.  పుంగ‌నూరు జాతి అవుల‌తో పాటు, బ‌న్నీ, తార్పాక‌ర్, ఒంగోలు జాతి ప‌శువుల‌ను కూడా ఈ విధానం ద్వారా పెంచే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని అధికారులు చెబుతున్నారు.  

Related Articles

Latest Articles