Sri Lanka: ఇండియన్ జాలర్లపై లంక నేవీ కాల్పులు.. భారత్ తీవ్ర నిరసన
- ఇండియన్ జాలర్లపై లంక నేవీ కాల్పులు
- తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్
- రెండు ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం అన్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక నేవీ దుందుడుకుగా ప్రవర్తించింది. భారతీయ మత్స్యకారులపై కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఇద్దరు జాలర్లు తీవ్రంగా గాయపడగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులు జాఫ్నా బోధనా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శ్రీలంక నేవీ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేవీ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ పరిణామం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని.. ఈ విషయంలో రెండు ప్రభుత్వాల మధ్య సమన్వయం కచ్చితంగా అవసరం అని భారత్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి..
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
మంగళవారం డెల్ఫ్ట్ ద్వీపం సమీపంలో 13 మంది భారతీయ మత్స్యకారులు చేపల వేట సాగిస్తుండగా.. లంక నేవీ అదుపులోకి తీసుకుంది. అయితే ఆ సమయంలో శ్రీలంక నావికాదళం కాల్పులకు తెగబడింది. తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన జాలర్లు గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా భారత్ తెలిపింది. మత్స్యకారుల కుటుంబాలను అన్ని విధాలుగా అండగా ఉంటామని.. సహాయాన్ని అందిస్తామని విదేశాంగ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Donald Trump: సుంకాల విషయంలో భారత్‌కి ట్రంప్ వార్నింగ్..
ఇక కాల్పుల ఘటనపై విదేశాంగ శాఖ స్పందిస్తూ.. న్యూఢిల్లీలోని శ్రీలంక తాత్కాలిక హైకమిషనర్‌ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కొలంబోలోని భారత హైకమిషన్ శ్రీలంక ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖతో కూడా ఈ విషయాన్ని లేవనెత్తినట్లు ప్రకటన తెలిపింది. జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని.. మత్స్యకారుల సమస్యలను మానవీయ కోణంలో.. మానవతా దృక్పథంతో చూడాలని భారత్ కోరింది. ఇలాంటి విధానం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Vivo T3x 5G: వివో 5G ఫోన్ పై బ్లాక్ బస్టర్ డీల్.. పిచ్చెక్కించే ఫీచర్లు.. దీనిపై ఓ లుక్కేయండి
తాజావార్తలు
-
Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
-
Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్‌పోల్‌కు కీలక అభ్యర్థన
-
Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
-
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!