ఇండియాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈరోజు భారీ స్థాయిలో కేసులు పెరిగాయి. ఇండియలో తాజాగా 44,643 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. ఇందులో 3,10,15,844 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,14,159 యాక్టివ్ కేసులున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 464 మంది మృతి చెందారు. ఇకపోతే, గడిచిన 24 గంటల్లో 41,096 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. దేశంలో ఇప్పటి వరకు 49,53,27,595 మందికి టీకాలు వేసింది ప్రభుత్వం.