INDIA Bloc: 30న ఇండియా కూటమి కీలక భేటీ.. ‘సర్’పై భవిష్యత్ కార్యాచరణపై చర్చ
- 30న ఇండియా కూటమి కీలక భేటీ
- ‘సర్’పై భవిష్యత్ కార్యాచరణపై చర్చ
- హాజరుకానున్న కూటమి పార్టీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ‘సర్’ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల సంఘంలో తీవ్ర విభేదాలు చోటుచేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కమిషన్ సభ్యులు వ్యతిరేకించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. తక్షణమే సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈనెల 25న దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు కూడా చేపట్టింది.
ఇక సెప్టెంబర్ 30న ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం కానుంది. విపక్ష పార్టీలన్నీ సమావేశమై.. ఎన్నికల సంఘం (EC), ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశాలపై చర్చించనున్నారు. ఇక SIRకు సంబంధించి ఎన్నికల సంఘంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో.. ఈ అంశంపై ఉమ్మడి కార్యాచరణపై విపక్ష పార్టీలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
- Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
- DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
- Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఉన్నారు. SIRకు సంబంధించిన పలు నిర్ణయాలు, ఆదేశాలపై సంధు, జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. గత 10 నెలల్లో కనీసం 14 సందర్భాల్లో వారు తమ అభిప్రాయాలను రికార్డులో నమోదు చేసినట్లు ఆ నివేదిక పేర్కొంది. అయితే ఎన్నికల సంఘం మాత్రం భిన్నాభిప్రాయాలు సంస్థాగత చర్చల్లో సాధారణమైనవేనని స్పష్టం చేసింది. నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని, అంతర్గతంగా వచ్చిన అభిప్రాయాలు, పరిశీలనలు నిర్ణయ ప్రక్రియలో భాగమేనని ఈసీ పేర్కొంది.
మమత, సీపీఎం చర్చలు
ఈ పరిణామాలతో పశ్చిమ బెంగాల్లో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC), సీపీఎం కూడా ఈసీ అంశంపై ఒకే వేదికపై చర్చించే పరిస్థితి ఏర్పడింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ.. ఇండియా కూటమి, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలకు లేఖ రాసి సమావేశం నిర్వహించాలని కోరాయి. ఆ తర్వాత మమతా బెనర్జీతో మాట్లాడగా.. ప్రస్తుత పరిస్థితిపై సమన్వయంతో చర్యలు అవసరమనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసినట్లు సమాచారం.
CEC తొలగింపు నోటీసు?
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్ డిమాండ్ చేస్తున్నాయి. SIR ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కూడా ఆ పార్టీలు కోరుతున్నాయి. కాంగ్రెస్ సైతం జ్ఞానేశ్ కుమార్‌పై తన విమర్శలను మరింత పెంచింది. ఇదే సమయంలో జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలంటూ ప్రతిపక్షాలు మరోసారి పార్లమెంట్లో తొలగింపు నోటీసు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. న్యాయ నిపుణుల పరిశీలన అనంతరం ఈ నోటీసును లోక్‌సభ, రాజ్యసభల్లో సమర్పించే అవకాశం ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది జరిగితే CECపై విపక్షాలు చేపట్టే మూడో ప్రయత్నం అవుతుంది.
సెప్టెంబర్ 29న కూడా
ఈ అంశంపై కాంగ్రెస్ కూడా తన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు సెప్టెంబర్ 29న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం నిర్వహించనుంది. ఆ తర్వాతి రోజే ఇండియా కూటమి పార్టీలు సమావేశమయ్యే అవకాశం ఉండటంతో.. ఈ అంశంపై ప్రతిపక్షాల తదుపరి కార్యాచరణపై ఆసక్తి నెలకొంది.
వివాదం ఏంటి?
SIR ప్రక్రియలో ఓటర్ల పేర్ల చేర్పు, తొలగింపు, పునరుద్ధరణ, ఓటర్ల డేటాబేస్ నిర్వహణ వంటి అంశాలపై ఎన్నికల కమిషనర్లు సంధు, జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు కథనాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఓటర్ల డేటాబేస్ నిర్వహణలో అధికారాలు ఢిల్లీలో కేంద్రీకృతమవుతున్నాయన్న ఆందోళనను వారు వ్యక్తం చేసినట్లు నివేదిక పేర్కొంది. SIRకు సంబంధించిన ఫారమ్-6లో కొత్త ప్రకటనను చేర్చడంపైనా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు మరో నివేదిక తెలిపింది. వారి అభిప్రాయం ప్రకారం, చట్టబద్ధమైన ఫారమ్‌లో మార్పులు చేయాలంటే సంబంధిత నిబంధనలను సవరించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
INDIA Bloc: 30న ఇండియా కూటమి కీలక భేటీ.. ‘సర్’పై భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
-
In Service Teachers TET: బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1న మరో టెట్ నోటిఫికేషన్..
-
22A Registrations: తెలంగాణలో 22-A ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులు వర్తిస్తాయ్..
-
Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?