Site icon NTV Telugu

BrahMos: పాకిస్తాన్‌‌పై “బ్రహ్మోస్‌”తో భారత్ దాడి.!

Brahmos

Brahmos

BrahMos: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భీకర దాడులు చేసింది. ఈ దాడిలో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయాలతో పాటు వాటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. అయితే, ఈ దాడుల్లో భారత్ ‘‘బ్రహ్మోస్ ’’ సూపర్ సోనిక్ క్షిపణిని ఉపయోగించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ బికనీర్ ప్రాంతంలో క్షిపణికి సంబంధించిన బూస్టర్, నోస్ క్యాప్ లభించాయి. దీనిని బట్టి చూస్తే ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్ ఈ క్షిపణిని ఉపయోగించినట్లు స్పష్టమవుతోంది.

ముఖ్యంగా, పాకిస్తాన్ పంజాబ్‌లోని బహవల్పూర్ జైషే మహ్మద్ ఉగ్ర కార్యాలయంపై దీనిని ప్రయోగించి ఉండొచ్చని తెలుస్తోంది. బహవల్పూర్ అంతర్జాతీయ సరిహద్దు నుంచి 100 కి.మీ దూరంలో ఉంది. దీనిపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి జరిగింది. భారత్, పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని మోహరించడంపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ కవ్వింతల తర్వాత భారత్ పాకిస్తాన్‌లోని రఫీకి (షోర్కోట్), మురిద్ (చక్వాల్), నూర్ ఖాన్ (రావల్పిండి), రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియన్ (కసూర్) వైమానిక స్థావరాలతో సహా విస్తృత శ్రేణి వ్యూహాత్మక పాకిస్తాన్ సైనిక ఆస్తులను లక్ష్యంగా చేసుకుంది. పస్రూర్, సియాల్ కోట్ లోని రాడార్ లను కూడా నావనం చేసింది. దీంతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దారుణంగా దెబ్బతింది. ఇదిలా ఉంటే, ఈ దాడుల్లో కూడా బ్రహ్మోస్ ఉపయోగించి ఉండొచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version