Rare Earth Magnets: చైనా ఆంక్షల మధ్య, “రేర్ ఎర్త్ అయస్కాంతాల”పై క్యాబినెట్ కీలక నిర్ణయం..
- రేర్ ఎర్త్ అయస్కాంతాల పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం..
- చైనా ఆంక్షల నేపథ్యంలో మోడీ సర్కార్ కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rare Earth Magnets: రేర్-ఎర్త్ అయస్కాంతాలపై చైనా గుత్యాధిపత్యం, చైనా ఆంక్షలను అరికట్టడానికి ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ మరియు రక్షణ పరికరాల్లో కీలకమైన రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాలు(REPMలు) తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం ఒక కొత్త పథకాన్ని ఆమోదించింది. భారతదేశం ఏడాదికి 6000 మెట్రిక్ టన్నుల రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్స్ తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూ. 7280 కోట్ల ఆర్థిక వ్యయాన్ని ఆమోదించింది. అరుదైన ఎర్త్ ఆక్సైడ్‌లను లోహాలుగా మార్చడం, లోహాలను మిశ్రమ లోహాలుగా మార్చడం, వీటిని అయస్కాంతాలుగా ఉత్పత్తి చేయడం వంటి ప్రక్రియలు ఈ పథకంలో భాగంగా ఉంటాయి. ఈ పథకాన్ని ఏడేళ్ల కాలానికి ఆమోదించారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ప్రస్తుతం, భారత్ దాదాపుగా శాశ్వత అయస్కాంతాలను దిగుమతి చేసుకుంటోంది. 2030 నాటికి వీటి డిమాండ్ రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో చైనాపై ఆధారపడకుండా దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. మొత్తం బడ్జెట్‌లో, ఐదు సంవత్సరాలలో అమ్మకాల-సంబంధిత ప్రోత్సాహకాలుగా రూ. 6,450 కోట్లు ఇవ్వబడతాయి. ఫెసిలిటీల ఏర్పాటుకు రూ.750 కోట్ల మూలధన సబ్సిడీగా అందించనున్నారు.
ఈవీ వాహనాల్లో వాడే మోటార్స్, విండ్ టర్బైన్స్, డ్రోన్లు, శాటిలైట్లు, వైద్య పరికరాల్లో ఈ అయస్కాంతాలు చాలా కీలకం. దేశీయ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే కేంద్రం ఆకాంక్షలను క్యాబినెట్ నిర్ణయం నెరవేర్చనుంది. దీంతో పాటు ఉద్యోగాలను సృష్టించడం, పెట్టుబడుల్ని ఆకర్షించడం, ప్రపంచ అరుదైన భూమి అయస్కాంత మార్కెట్‌లో భారత్‌ను కీలక ఆటగాడిగా నిలబెట్టాలని కేంద్రం భావిస్తోంది.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!