Exports Of Hair: కురులతో కోట్ల ఆదాయం.. ఐదేళ్లల్లో 370 మిలియన్ డాలర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Exports Of Hair: గ్రామాల్లో చిక్కువెంట్రుకలను మహిళలు భద్రంగా దాచిపెడతారు.. ఎందుకంటే వాటిని సవరాల వారికి ఇస్తే.. వారు సవరాలను ఇస్తారు. ఒకవేళ ఎవరైనా తమకు సవరాలు వద్దు అనుకుంటే వారికి డబ్బులను ఇస్తారు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఇలా చేస్తున్నారు. కొన్ని పట్టణాల్లో కూడా ఇలా సవరాలు అమ్మే వారు అడుగుతున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. మనుషుల వెంట్రుకలు కూడా ఆదాయ వనరే అని చెప్పడానికి. ఇండియాలోని మనుషుల కురులను ఇతర దేశాలకు ఎగుమతి చేసి కోట్ల ఆదాయం సంపాదిస్తోందట.. గత ఐదేళ్లల్లో 370 మిలియన్ డాలర్లు ఆదాయం పొందిన పార్లమెంటులో ప్రకటించారు.
Read also: Sathyaraj: బ్రేకింగ్.. బాహుబలి కట్టప్ప ఇంట తీవ్ర విషాదం
Also Read
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
గడచిన 5 సంవత్సరాల్లో భారతదేశ జట్టు ఉత్పత్తుల ఎగుమతులు నాలుగు రెట్లు పెరిగాయని.. ఈ కాలంలో భారతదేశం నుంచి 370.11 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన మానవ జుట్టు ఎగుమతి చేసినట్లు కేంద్రం వెల్లడించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ సమాధానమిచ్చారు. 2018-19లో 34.46 మిలియన్ డాలర్లు, 2019-20లో 5.70 మిలియన్ డాలర్లు, 2020-21లో 11.65 మిలియన్ డాలర్లు, 2021-22లో 149.07 డాలర్లు, 2022-23లో 169.23 మిలియన్ డాలర్లు విలువచేసే జుట్టు ఎగుమతి చేసినట్లు మంత్రి సభకు తెలిపారు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో జట్టు ఎగుమతులు నాలుగు రెట్లు పెరిగాయని తెలిపారు. హ్యూమన్ హెయిర్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ అసోసియేషన్, ప్లెక్స్కాన్సిల్ అందించిన సమాచారం ప్రకారం.. ప్రపంచంలోనే హ్యూమన్ హెయిర్ ప్రొడక్ట్స్ కు(ముడి పదార్థం) భారత్ కేంద్రంగా మారిందని చెప్పారు. భారత్ నుంచి లభించే జుట్టు ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనదనీ, ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని కేంద్ర మంత్రి తెలిపారు. జుట్టు ఎగుమతులలో ఈ ఆధిపత్యాన్ని ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటుందనే దానిపై, ప్రపంచవ్యాప్తంగా వివిధ వాణిజ్య ప్రదర్శనలకు హాజరు కావడానికి పరిశ్రమతో కలిసి ప్లెక్స్కాన్సిల్ చురుకుగా పనిచేస్తోందని కేంద్రమంత్రి చెప్పారు. అలాగే విగ్‌ల వంటి అధిక విలువైన వస్తువులను ఉత్పత్తి చేయడం ప్రారంభించడానికి భారతీయ ఎగుమతిదారులకు శిక్షణను అందించడానికి ప్లెక్స్కాన్సిల్ తో ప్రభుత్వం కలిసి పనిచేస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!