Yogi Adityanath: అయోధ్యలో ఇకపై బుల్లెట్ల మోతలు, కర్ఫ్యూలు ఉండవు..ములాయం సింగ్‌పై విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: అయోధ్యలో ఈ రోజు రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నేత, మాజీ సీఎం దివంగత ములాయం సింగ్ యాదవ్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 1990లో అయోధ్యలో జరిగిన కాల్పుల్లో 17 మంది కరసేవకులు మరణించారు. ఈ సమయంలో ములాయం సింగ్ సీఎంగా ఉన్నారు.
యోగి మాట్లాడుతూ.. ‘‘ఇకపై అయోధ్య అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. అయోధ్య సందుల్లో బుల్లెట్ల మోతతో ప్రతిధ్వనించదు. కర్ఫ్యూలు ఉండవు. ఇప్పుడు దీపోత్సవం, రామోత్సవాలు జరుతాయి. రామకీర్తనలు ప్రతిధ్వనిస్తాయి. ఈ రోజు ఇక్కడ రామ్ లల్లా రామరాజ్యాన్ని సూచిస్తున్నారు’’. అని ఆయన అన్నారు. 1990 సంఘటనల గురించి ప్రస్తావిస్తూ..ఎస్పీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
Also Read
- DK Shivakumar: ఆర్సీబీ అభిమానులకు అన్యాయం.. నిర్వాహకులపై విమర్శలు గుప్పించిన డీకే శివకుమార్
- JEE Advanced Result 2026: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రిలీజ్.. టాపర్ ఎవరంటే?
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్‌లలో కీలక మార్పులు
Read Also: Mamata Banerjee: రామ మందిరానికి పోటీగా.. బెంగాల్‌లో మమత “సర్వమత” ర్యాలీ
అసలేం జరిగింది:
1990లో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ సారథ్యంలో రథయాత్ర నేపథ్యంలో రామ మందిర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్ద ఎత్తున అయోధ్యకు చేరుకుంటుండటంతో సీఎంగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ బలగాలను మోహరించారు. ‘‘అయోధ్యలో ఒక్క పక్షి కూడా ఎగరదు’’ అని ములాయం సింగ్ ప్రకటించాడు. అక్టోబర్ 30న రాష్ట్ర పోలీసులు బస్సుల్ని, రైళ్లను అడ్డుకోవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు పాదయాత్ర చేశారు. బాబ్రీ మసీదు వద్ద ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో నవంబర్ 1న పోలీసులు కాల్పులు జరపడంతో 17 మంది కరసేవకులు మరణించారు. ఆ తర్వాత ఏడాది జరిగిన ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. అతని కాలంలోనే డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదుని కూల్చివేత జరిగింది.
తాజావార్తలు
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
-
Venkatesh iyer: కుంటుకుంటూ.. రెచ్చిపోతూ.. RCBకి కప్ తెచ్చిన సూపర్ డూపర్ హీరో.. ఫైనల్ అంటేనే రెచ్చిపోయే ప్లేయర్!
-
Mega 158 : నేటి నుండి పొల్లాచ్చిలో మెగా 158.. ఏమి చేస్తున్నారంటే?
-
Rajat Patidar: ధోనీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
-
Peddi Pre-Release Event : నేడే బెజవాడలో రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!