Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News In Pursuit Of Killer Karnataka Police Dog Runs 8 Km Saves Womans Life

Police Dog: 8 కి.మీ పరిగెత్తి హంతకుడిని పట్టించి, మహిళను రక్షించిన పోలీస్ జాగిలం..

Published Date :July 19, 2024 , 7:12 pm
By Venu Goapl Reddy
  • పోలీస్ జాగిలం సాయంతో 6 గంటల్లో హత్య నిందితుడి పట్టివేత..
  • వ్యక్తిని హత్య చేసి.. భార్యను హత్య చేయబోయిన నిందితుడు..
  • అక్రమ సంబంధం కారణంగా హత్య..
  • నిందితుడిని పట్టించడంలో కీలకంగా వ్యవహరించిన పోలీస్ జాగిలం..
Police Dog: 8 కి.మీ పరిగెత్తి హంతకుడిని పట్టించి, మహిళను రక్షించిన పోలీస్ జాగిలం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Police Dog: కర్ణాటకలో ఓ పోలీస్ జాగిలం వీరోచితంగా ఒక అనుమానాస్పద హంతకుడిని పట్టించడంతో పాటు మహిళను రక్షించింది. వర్షంలో 8 కి.మీ తడుస్తూ పరిగెత్తి హంతకుడిని గుర్తించింది. ఒక మహిళ ప్రాణాలను రక్షించడంలో పోలీస్ జాగిలం కీలక పాత్ర పోషించింది. గురువారం చన్నగిరి తాలుకా సంతబెన్నూర్‌లోని పెట్రోల్ పంప్ సమీపంలోని బడా రోడ్డులో ఒక వ్యక్తి డెడ్‌బాడీ లభ్యమైంది. ఈ కేసులో హంతకుడిని గుర్తించేందుకు తుంగ-2 అనే పోలీస్ జాగిలాన్ని బరిలోకి దించారు.

Read Also: Hyderabad: విద్యుత్ సిబ్బందిపై దాడి చేస్తే చట్టపరమైన చర్యలు- TGSPDCL CMD

ఎస్పీ ఉమా ప్రశాంత్ తుంగ-2తో పాటు దాని హ్యాండ్లర్, కానిస్టేబుల్ షఫీ, ఇతర సిబ్బందిని ఘటనాస్థలంలో మోహరించారు. డాబర్‌మాన్ కుక్క వ్యక్తి దుస్తులను వాసన చూసి, చన్నపురా వైపు పరుగులు తీసింది. పోలీస్ జాగిలం తుంగ-2 దాని హ్యాండ్లర్ దాదాపుగా 8 కి.మీ పరిగెత్తారు. హఠాత్తుగా ఓ ఇంటి ముందు కుక్క ఆగిపోయింది. అదే సమయంలో ఆ ఇంటి నుంచి వస్తున్న అరుపుల్ని పోలీసులు విన్నారు. లోపలికి వెళ్లి చూడగా, రంగస్వామి అనే వ్యక్తి భార్యను తీవ్రంగా కొట్టడం గమనించారు. అప్పటికే సదరు మహిళ తీవ్రగాయాలతో ప్రాణాలు పోయే స్థితిలో ఉంది.

అతడిని విచారించగా వారు వెతుకుతున్న హంతకుడు రంగస్వామే అని తేలింది. రోడ్డు పక్కన దొరికిన శవం సంతబెన్నూర్‌కి చెందిన సంతోష్(33)దిగా పోలీసులు గుర్తించారు. భార్యతో అక్రమ సంబంధం ఉందనే కారణంతో సంతోష్‌ని రంగస్వామి వేట కొడవలితో హత్య చేశాడు. ఆ తర్వాత మృతుడు సంతోష్ వానన చూసిన పోలీస్ జాగిలం హత్య జరిగిన ప్రదేశం నుంచి నిందితుడు రంగస్వామి ఇంటి వైపు వెళ్లి పట్టించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • davanagere
  • karnataka
  • Police Dog
  • Tunga-2

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions