NTV Telugu Site icon

PM Modi: రష్యా మాకు ‘ఆల్ వెదర్ ఫ్రెండ్’’.. ‘డిస్కో డాన్సర్‌’ గురించి ప్రస్తావన..

Pm Modi

Pm Modi

PM Modi: రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ భారత్-రష్యా బంధాన్ని కొనియాడారు. రష్యాలో ప్రాచుర్యం పొందిన బాలీవుడ్ స్టార్ల గురించి గుర్తు చేశారు. మాస్కోలోని ఇండియన్ కమ్యూనిటీని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. రష్యాలో ప్రజాధరణ పొందిన 1955 నాటి రాజ్‌కపూర్ ‘శ్రీ 420‘ లోని క్లాసిక్ సాంగ్ ‘‘ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ’’ గురించి మాట్లాడారు. ‘‘ప్రతీ భారతీయులు రష్యా అనే మాట విన్నప్పుడు, రష్యా భారత్ యొక్క ‘ఆల్ వెదర్ ఫ్రెండ్’ అని హృదయం ఉప్పొంగుతుందని, రష్యా భారత సుఖాల్లో, దు:ఖాల్లో వెంటుండే మిత్రుడు’’ అని అన్నారు.

Read Also: BJP MLA: శివుడు మూడో కన్ను తెరిస్తే రాహుల్ గాంధీ బూడిదే.. పార్లమెంట్‌లోనే అతడిని కొట్టాలి..

ప్రతి భారతీయుడి హృదయాల్లో – ‘సర్ పర్ లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ’ (తలపై ఎర్రటి రష్యన్ టోపీ ఉంది, కానీ హృదయం ఇప్పటికీ భారతీయమైనది)” అని మోడీ చెప్పాడు. రెండు దేశాల మధ్య బలమైన బంధాన్ని పెంపొందించడంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ నాయకత్వాన్ని మోడీ ప్రశంసించారు. గత దశాబ్ధ కాలంలో తాను ఆరు సార్లు రష్యాలో సందర్శించాని, పుతిన్‌తో 17 సార్లు సమావేశమైన విషయాన్ని మోడీ ప్రస్తావించారు.

రష్యాలో ఎంతో గుర్తింపు పొందిన బాలీవుడ్ స్టార్లలో మిథున్ చక్రవర్తి ఒకరు. ఈ విషయాన్ని మోడీ గుర్తు చేశారు. మిథున్ చక్రవర్తి 1982లో నటించిన ‘ డిస్కో డాన్సర్’లో అతడి పాత్ర పేరు జిమ్మి. ఈ పేరుతో రష్యాలో ఆయన ప్రజాధరణ పొందారు. 1980 చివర్లో అప్పటి సోవియట్ నేత మిఖాయిల్ గోర్బచేవ్‌కి అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ అమితాబ్ బచ్చన్‌ని పరిచయం చేస్తూ, ఇతను భారతదేశ సూపర్ స్టార్ అని చెప్పారు. అయితే గొర్బచేవ్ మాత్రం తన కుమార్తెకు మిథున్ మాత్రమే తెలుసని సమాధానమిచ్చారు.

Show comments