Site icon NTV Telugu

Sandeshkhali Clashes: “బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించండి”.. సందేశ్‌ఖలీ అత్యాచారాలపై ఎస్‌సీ జాతీయ కమిషన్..

Sandeshkhali Clashes

Sandeshkhali Clashes

Sandeshkhali Clashes: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సందేశ్‌ఖలీ ప్రాంతం అట్టుడుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్, అతని గుండాల అకృత్యాలపై అక్కడి మహిళలు, యువత భగ్గుమంటోంది. నేరస్తులను వెంటనే అరెస్ట్ చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనలకు బీజేపీ మద్దతు తెలుపుతోంది. మరోవైపు ఈ అల్లర్ల వెనక ఆర్ఎస్ఎస్ ఉందని బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే, సందేశ్‌ఖలీలో టీఎంసీ అఘాయిత్యాలపై, అనేక లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బీజేపీ ఆరోపించిన నేపథ్యంలో ‘రాష్ట్రపతి పాలన’ను షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్(ఎన్సీఎస్‌సీ) శుక్రవారం సిఫారసు చేుసింది. ఎన్‌సీఎస్‌సీ ప్రతినిధి బృందం గురువారం సందేశ్‌ఖలీని సందర్శించింది. ఈ ఉదయం రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు నివేదికను అందచేసింది. NCSC చైర్‌పర్సన్ అరుణ్ హాల్డర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేరస్తులు అక్కడి ప్రభుత్వంతో చేతులు కలిపారని, ఇది ఎస్సీ సంఘాల సభ్యుల జీవితాలపై ప్రభావం చూపిస్తోందని అన్నారు. టీఎంసీ నేత షేక్ షాజహాన్ లైంగిక దాడికి గురైన మహిళల్ని కలిసేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం నుంచి ఎన్‌సీఎస్‌సీకి ఎలాంటి సాయం అందలేదని అన్నారు.

Read Also: PM Modi: రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం పనిచేస్తోంది..ఆందోళనల నేపథ్యంలో పీఎం కీలక వ్యాఖ్యలు..

మరోవైపు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి కూడా సందేశ్‌ఖలీ అల్లర్లపై స్పందించారు. ప్రతిపక్షాలు ఆ ప్రాంతానికి వెళ్తా అంటే మమతా బెనర్జీ ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే ఆ ప్రాంతంలోని మహిళల్ని రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కలుసుకున్నారు. బుధవారం బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ ఆందోళనలకు మద్దతు తెలిపారు.

రేషన్ కుంభకోణంలో టీఎంసీ నేత షేక్ షాజహాన్ ప్రయేమంపై ఈడీ విచారణ జరిపేందుకు వెళ్లిన సందర్భంలో అతని అనుచరులు అధికారులపై దాడులకు తెగబడ్డారు. ఈ తర్వాత ఆ ప్రాంతంలోని మహిళలపై టీఎంసీ గుండాలు అత్యాచారాలకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా మహిళలు వారిపై తిరబడ్డారు. మరోవైపు ప్రధాన సూత్రధారి, నిందితుడిగా ఉన్న షేక్ షాజహాన్ నెల రోజల నుంచి పరారీలో ఉన్నాడు.

Exit mobile version