Rujira Banerjee: దుబాయికి వెళ్లకుండా రుజిరా బెనర్జీని అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rujira Banerjee: |పశ్చిమబెంగాల్‌కి చెందిన ఎంపీ భార్య తన పిల్లలతో దుబాయికి వెళ్లాలనుకోగా.. ఎయిర్పోర్ట్ లోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఈడీ కేసులో తన పేరు ఉన్న నేపథ్యంలో ఎంపీ భార్య అయినప్పటికీ దుబాయ్ వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీని సోమవారం కోల్‌కతా విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. తమ ఇద్దరు పిల్లలతో కలిసి దుబాయి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. వెళ్లేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అయితే కొద్దిసేపటి వరకు అక్కడే వేచిఉన్న రుజిరా బెనర్జీ అధికారులు ఎంతకు అనుమతి ఇవ్వకపోవడంతో .. చివరకు పిల్లలతో కలిసి ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. దుబాయ్ వెళ్లడానికి రుజిరా బెనర్జీకి అనుమతి ఇవ్వని ఇమ్మిగ్రేషన్ అధికారులను టీఎంసీ వర్గాలు విమర్శిస్తున్నాయి.
Read also: Crude Oil: రష్యా నుంచి 1.96 మిలియన్ల చమురు దిగుమతి.. రికార్డు సృష్టించిన భారత్
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
బెంగాల్లో జరిగిన కోల్(బొగ్గు) మైనింగ్ కేసును ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రుచిరా బెనర్జీని సైతం ఈడీ అధికారులు ఇప్పటికే విచారించారు. తాజాగా ఈడీ అమెకు సమన్లు జారీ చేసింది. జూన్ 8న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేమని ఇమ్మిగ్రేషన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ కోర్టులో కేసు విచారణ కొనసాగుతుందని.. ఆ కేసులో రుజిరా బెనర్జీ ఇంకా బెయిల్ తీసుకోలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను ప్రస్తుతం దేశం నుంచి బయటకు వెళ్లడానికి అనుమతి ఇవ్వలేమని ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ స్పష్టం చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే రుజిరా బెనర్జీని సోమవారం విదేశాలకు వెళ్లకుండా నిలిపివేసినట్లు ఇమ్మిగ్రేషన్ శాఖ అధికారులు పేర్కొన్నారు. రుజిరా బెనర్జీని ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకోవడంపై తృణమూల్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read also: US: AI చాట్‌బాట్‌తో ప్రేమలో పడిన మహిళ.. అక్కడితో ఆగకుండా..!
ఈస్ట్రర్న్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్‌కు చెందిన గనుల్లో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై గతేడాది సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కుంభకోణంలో అభిషేక్ బెనర్జీ లబ్ధి పొందారని ఈడీ ఆరోపించింది. లబ్ధి పొందిన సొమ్మును విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అయితే తనపై వచ్చిన అభియోగాలను ఎంపీ అభిషేక్ బెనర్జీ ఖండించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
OTR: వరంగల్ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!