Site icon NTV Telugu

PM Modi: ‘‘పాక్ దాడి చేస్తే, మా దాడి తీవ్రంగా ఉంటుంది’’.. ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని మోడీ సంచలనం..

Modi Jd

Modi Jd

PM Modi: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం అంతర్జాతీయ సమాజం ఆందోళన మేరకు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిరింది. రెండు దేశాల మధ్య తాము మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాలతో సుదీర్ఘం మాట్లాడి కాల్పుల విమరణకు ఒప్పించినట్లు ఆయన ప్రకటించారు.

Read Also: China: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య, సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసిన చైనా..

అయితే, ఈ కాల్పుల విరమణలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం గురించి చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ, జేడీ వాన్స్‌తో మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఒకవేళ భారతదేశంపై దాడి చేస్తే, తీవ్రంగా దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసినట్లు ఆదివారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కాశ్మీర్ విషయంలో భారత వైఖరి స్పష్టంగా ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)ని తిరిగి తీసుకువడం మిగిలి ఉందని చెప్పినట్లు, పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని అప్పగించాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.భారత్-పాక్ మధ్య ఎవరూ మధ్యవర్తిత్వం వహించాలని భారత్ కోరుకోవడం లేదని మోడీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, మనం కొత్త సాధారణ స్థితిలో ఉన్నామని ఆయన చెప్పారు. ప్రపంచం, పాకిస్తాన్ దీనిని అంగీకరించాలని చెప్పినట్లు సమాచారం.

Exit mobile version