Stray Dogs Issue: దేశంలో వీధికుక్కల దాడులు ఇటీవల కాలంలో చర్చనీయాంశం అయ్యాయి. తెలంగాణలో వీధికుక్కులు ఏకంగా ఓ నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసి దారుణంగా చంపాయి. ఇదే విధంగా పలు రాష్ట్రాల్లో చిన్నారులపై వీధి కుక్కలు దాడులు చేశాయి. ఇదిలా ఉంటే జార్ఖండ్ బీజేపీ ఎమ్మెల్యే బిరంచి నారాయణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో వీధికుక్కల అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం వీధి కుక్కల సమస్యకు పరిష్కారం కనుక్కోలేకపోతే, నాగాలాండ్ ప్రజలు పిలవండి అంటూ వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా నాగాలాండ్ లోని కొంతమంది ప్రజలు కుక్కమాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Manik Rao Thakre : హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది
ఒక్క రాంచీలోని రోజుకు దాదాపుగా 3000 మంది కుక్కకాటు వల్ల వస్తున్నారని బొకారో ఎమ్మెల్యే బిరంచి నారాయణ్ అన్నారు. టీకాలు, స్టెలిలైజేషన్ లేకపోవడం వల్ల ప్రజలకు ముప్పు వాటిల్లితోందని ఆయన అన్నారు. కుక్కల దాడితో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందించే నిబంధనను కూడా తీసుకురావాలన్నారు. కుక్కలు, పెంపుడు జంతువుల ప్రేమికులు సరైన లైసెన్స్ లేకుండా వాటిని పెంచుకుంటున్నారని బిరాంచి చెప్పారు. బొకారో నగరంలోని వీధి కుక్కలను పట్టుకోవడం, చికిత్స చేయడం,స్టెరిలైజ్ చేయడం వంటి ఏర్పాట్లు లేవని, రాంచీలోని అన్ని ప్రధాన నగరాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ధన్‌బాద్ ఎమ్మెల్యే మధుర మహ్తో మాట్లాడుతూ.. ఒక జిల్లాలో వీధికుక్కలను పట్టుకున్నప్పటికీ, మరో జిల్లాలో వాటిని విడిచిపెట్టి, అక్కడ ప్రజలకు సమస్యలను సృష్టిస్తున్నారని అన్నారు. బొకారో నుంచి తీసుకెళ్లిన వీధికుక్కలను ధన్‌బాద్‌లో వదిలేస్తున్నారని అన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో కుక్కల దాడుల వల్ల ఏడాదికి 50 మంది మరణిస్తున్నారని సీపీఎం ఎమ్మెల్యే వినోద్ సింగ్ అన్నారు. దీనిపై ఇన్‌చార్జి మంత్రి సత్యానంద్ భోగ్తా సమాధానమిస్తూ.. ప్రభుత్వం త్వరలో సమస్యను పరిష్కరిస్తుందని అన్నారు. వీధికుక్కలను పట్టుకుని వాటికి వ్యాక్సిన్లు వేసి స్టెలిలైజ్ చేస్తామని తెలిపారు.