Modi Clarification: చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్ర్తవేత్తలను అభినందించడానికి ప్రధాన నరేంధ్ర మోడీ ఈ రోజు బెంగళూరు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగానీ, ఉప ముఖ్యమంత్రిగానీ, గవర్నర్ గానీ ఎవరూ హాజరు కాలేదు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. కావాలనే బీజేపీ వారు ఇలా వ్యవహారించారని మండిపడింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టే ప్రధాని వారిని ఎయిర్‌పోర్టుకు ఆహ్వానించలేదని విమర్శించారు. అయితే ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టత ఇచ్చారు.
Read Also: Sakshi: అయ్యో… ఇద్దరూ ముంచేశారు!
శనివారం ఉదయం బెంగళూరుకు వచ్చిన ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు.. కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరిలో ఎవరూ హాజరుకాలేదు. మోదీ ఉద్దేశపూర్వకంగానే వారిని ఎయిర్‌పోర్టుకు రావొద్దన్నారని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ‘తనకంటే ముందు కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇస్రో(ISRO) శాస్త్రవేత్తలను అభినందించడంపై మోదీ చాలా చికాకుగా ఉన్నారు. అందుకే ప్రొటోకాల్‌కు విరుద్ధంగా.. వారిద్దరిని ఉద్దేశపూర్వకంగా ఎయిర్‌పోర్టుకు రాకుండా ఆపేశారు. ఇలాంటి రాజకీయాలు హాస్యాస్పదంగా ఉన్నాయని.. చంద్రయాన్-1 విజయం వేళ.. 2008లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కంటే ముందు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ.. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు వెళ్లారు. ఆ విషయాన్ని మోదీ మర్చిపోయారా..?’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ గుర్తు చేశారు.
ఈ వ్యవహారంపై బెంగళూరులోని హాల్ ఎయిర్‌పోర్టు వెలుపల ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘బెంగళూరు(Bengaluru)కు నేను ఏ సమయంలో చేరుకుంటానో ఖచ్చితంగా తెలియదు… అందుకే ప్రొటోకాల్ విషయంలో గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టదల్చుకోలేదని.. అందుకే వారిని రావొద్దని చెప్పాను’ అని మోడీ వెల్లడించారు. శుక్రవారం గ్రీస్ దేశంలో పర్యటించిన ప్రధాని మోడీ … ఈ ఉదయం నేరుగా బెంగళూరు వచ్చి, శాస్త్రవేత్తలతో మాట్లాడారు. వారి కృషికి సెల్యూట్ చేశారు.
Read Also: Indian Cinema: 2500 కోట్లు… ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్… కలెక్షన్ల సునామీ రాబోతుంది
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఇదే అంశంపై స్పందించారు. ‘ప్రధాని మోడీ చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ప్రొటోకాల్ ప్రకారం సీఎం, నేను ప్రధానిని ఆహ్వానించేందుకు వెళ్దామని అనుకున్నాం. కానీ ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన సమాచారాన్ని మేం గౌరవించాలనుకున్నాం. పొలిటికల్ గేమ్ ఇప్పటికే ముగిసింది. ఇప్పుడు అభివృద్ధిపై దృష్టి సారించాం’ అని శివకుమార్ అన్నారు.