Delhi High Court: భర్త వివాహేతర సంబంధం, భార్య ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు..
- భర్త వివాహేతర సంబంధం, భార్యని ఆత్మహత్యకు ప్రేరిపించినట్లు కాదు..
- వివాహేతర సంబంధం ఆమెని హింసిచినట్లు నిరూపించకపోతే "క్రూరత్వం" కిందకు రాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi High Court: ఒక వ్యక్తి వివాహేతర సంబంధం భార్యను వేధించినట్లు లేదా హింసించినట్లు చూపించకపోతే అది క్రూరత్వం లేదా ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం పేర్కొంది. భర్త వివాహేతర సంబంధం భార్య వరకట్న మరణానికి పాల్పడటానికి కారణం కాదని జస్టిస్ సంజీవ్ నారులా అన్నారు. మార్చి 18, 2024లో ఒక మహిళ తన అత్తగారింట్లో అసహజంగా మరణించింది. దీనిపై IPC సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం)తో పాటు సెక్షన్ 498A (క్రూరత్వం)/304-B (కట్నం మరణం) కింద అరెస్టు చేయబడిన వ్యక్తికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి, ఒక మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నాడని తెలిపే వీడియోలు, చాట్ రికార్డులు ఉన్నాయి. ‘‘వ్యక్తికి వివాహేతర సంబంధం ఉందని భావించినప్పటికీ, అది మరణించిన వ్యక్తిని హింసించినట్లు, వేధించినట్లు చూపించకపోతే, ఆ వివాహేతర సంబంధం సెక్షన్ 498A IPC కింద క్రూరత్వం లేదా సెక్షన్ 306 IPC కింద ఆత్మహత్య ప్రేరేపణలకు కిందకు రాదని చట్టం తేల్చింది. ’’ అన కోర్టు పేర్కొంది.
Also Read
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
Read Also: India Pakistan: పాక్ హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన భారత్..కారణం ఇదే..
‘‘వివాహేతర సంబంధం సెక్షన్ 304B IPC(వరకట్న వేధింపులతో మరణం) కింద నిందితుడిని ఇరికించడానికి కారణం కాదు. వేధింపులు లేదా క్రూరత్వానికి వరకట్న డిమాండ్లు కారణమని చూపించాలని కోర్టు చెప్పింది.’’ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి 2024 నుంచి కస్టడీలో ఉన్నాడని, అతడికి నిరంతర జైలు శిక్ష వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని కోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తు ముగిసిన తర్వాత చార్జిషీట్ దాఖలైందని, విచారణ సమీప భవిష్యత్తులో ముగిసే అవకాశం లేదని, సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం కూడా లేదని గ్రహించిన కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అతనిని రూ. 50,000 వ్యక్తిగత బాండ్‌పై విడుదల చేయాలని ఆదేశించింది, అంతే మొత్తంలో ఇద్దరు పూచీకత్తులు కూడా చెల్లించాలని ఆదేశించింది.
భర్త సహోద్యోగితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని, ఇది తెలిసిన తర్వాత భార్యని వేధించాడని మహిళ కుటుంబం ఆరోపించింది. సదరు వ్యక్తి, భార్యని గృహహింసకు గురిచేస్తున్నాడని, అతను కారు కొనుగోలు చేసిన కారుకు, భార్య కుటుంబమే ఈఎంఐ చెల్లించాలని ఆమెపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించింది. సదరు మహిళ, ఆమె కుటుంబం ఆమె జీవించినప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయలేదని కోర్టు గుర్తించింది.
తాజావార్తలు
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
-
Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
-
Tech News: మనల్ని మింగేసే రాక్షసి..! బాంబు పేల్చిన ‘క్లాడ్’
-
Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
-
Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!