NTV Telugu Site icon

Congress: “ఎంతకాలం డీఎంకేపై ఆధారపడాలి”.. తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..

Congress

Congress

Congress: తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకేపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో డీఎంకేపై కాంగ్రెస్ ఎంతకాలం ఆధారపడుతుందని టీఎన్ పీసీసీ చీఫ్ సెల్వపెరుంతగై ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ కౌన్సిల్ సమావేశంలో టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై ఈ వ్యాఖ్యలు చేశారు.

చెన్నైలోని కామరాజర్ అరంగంలో ఈరోజు జరిగిన కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఏడు తీర్మానాలు ఆమోదించారు. 2024 లోక్‌సభ ఎన్ని్కల్లో భారీ విజయం అందించినందుకు తమిళనాడు ఓటర్లకు తీర్మానంలో ధన్యవాదం తెలిపారు. నీట్ పరీక్షలపై నిర్ణయం తీసుకునే హక్కు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తీర్మానం చేశారు. జలశక్తి మంత్రిగా కర్ణాటకకు చెందిన వీ సోమన్నను నియమించడంపై, ఆయన తమిళనాడు సంక్షేమానికి వ్యతిరేకంగా కావేరి సమస్యలపై పక్షపాతంగా వ్యవహరిస్తారని, అతడిని తొలగించాలని మరో తీర్మానంలో డిమాండ్ చేశారు.

Read Also: Chiranjeevi: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లిన చిరు!!

కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రసంగిస్తూ, బీజేపీకి మెజారిటీ ఇవ్వనందుకు ప్రజల్ని ప్రశంసించారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఏ దిశలో వెళ్లాలనేది కూడా నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు. ‘‘ప్రజలు మనకు దగ్గరగా వచ్చారు, చరిత్ర మారబోతోంది. మనం ఏ దిశలో పయనించబోతున్నాం. మిత్రపక్షం వేరు.. మన మిత్రుడితో మనం నిజాయితీగా ఉండగలం అయితే మనం ఆధారపడతామా..? ఎంతకాలం.. మేము వారిపై డిపెండెంట్‌గా ఉండబోతున్నామా..?’’ అని ప్రశ్నించారు. తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై సెల్వపెరుంతగై చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నేతలు ఈశీకేఎస్ ఇళంగోవన్, కేఎస్ అళగిరి విభేదించారు.

ఇళంగోవన్ మాట్లాడుతూ.. తమిళనాదడులో కామరాజర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నప్పటికీ, మన శత్రువులను(బీజేపీ)ని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పట్ల అందరికీ ఉన్న భావోద్వేగానే నాకు ఉన్నాయని, కాంగ్రెస్ తమిళనాడులో అట్టడుగు ప్రజలకు చేరేందుకు సహకరించిన పెరియార్ కుటుంబానికి చెందిన వాడిననని, మన శత్రువులను నిర్మూలించకుండా మనం ఆ స్థలాన్ని ఎలా స్వాధీనం చేసుకుంటామని అడిగారు. ఇక్కడ అందరూ ఎంపీలు కావడానికి డీఎంకే, సీఎం స్టాలిన్ కారణమనే విషయాన్ని మరిచిపోకండి అని అన్నారు.